కమెడియన్ సునీల్ కూతురు ప్రాణాలను రాజశేఖర్ కాపాడారా.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా రాజశేఖర్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ మధ్య కాలంలో రాజశేఖర్ నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద హిట్ కాలేదు. రాజశేఖర్ నటించిన శేఖర్ సినిమా ఈ నెల 20వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాతో రాజశేఖర్ సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జీవిత డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన జోసెఫ్ రీమేక్ అనే సంగతి తెలిసిందే,

హీరో రాజశేఖర్ ఇతర హీరోల విషయాలను పెద్దగా పట్టించుకోరు. అదే సమయంలో తనపై ఎవరైనా విమర్శలు చేస్తే మాత్రం రియాక్ట్ అయ్యే విషయంలో ఆయన వెనుకడుగు వేస్తున్నారు. రాజశేఖర్ ముక్కుసూటితనం వల్లే ఇండస్ట్రీలో ఆయనకు శత్రువులు పెరిగారని చాలామంది భావిస్తారు. అయితే రాజశేఖర్ డాక్టర్ చదివి యాక్టర్ అయ్యారనే సంగతి తెలిసిందే. రాజశేఖర్ డాక్టర్ గా పేద ప్రజలకు వైద్యం అందించారు.

ప్రముఖ టాలీవుడ్ కమెడియన్లలో ఒకరైన సునీల్ కూతురు ఒకరోజు తీవ్ర అనారోగ్యానికి గురి కాగా ఆ సమయంలో రాజశేఖర్ వైద్యం చేసి సునీల్ కూతురిని కాపాడారని సమాచారం. ఒక సందర్భంలో సునీల్ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. ఈ విషయం తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఒకవైపు నటుడిగా కొనసాగుతూనే అవసరమైన సమయంలో వైద్యుడిగా సేవలు అందిస్తుండటంతో రాజశేఖర్ ను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

జీవిత, రాజశేఖర్ గురించి నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు నెలకొన్నా వాళ్లు ఎన్నో సేవా కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. ఎంతోమంది పిల్లలను చదివించడంతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో జీవిత రాజశేఖర్ తమ వంతు సహాయం చేశారు. శేఖర్ సినిమాకు పోటీగా మరే సినిమా థియేటర్లలో రిలీజ్ కావడం లేదు.