Color Swathi: సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు ఎంత తొందరగా అయితే ప్రేమలో పడతారో అంతే తొందరగా తమ బంధం నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటారు ఇలా ఎంతోమంది ప్రేమించుకొని బ్రేకప్ చెప్పుకోవడం మరికొందరు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య అధికమవుతుంది.
ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోయారు అయితే తాజాగా మరొక జంట కూడా విడాకులు తీసుకొని విడిపోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా ఒక తెలుగు అమ్మాయి కొనసాగడం అంటే చాలా అరుదు అలా తెలుగు అమ్మాయి ఇండస్ట్రీలోకి వచ్చే హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో కలర్స్ స్వాతి ఒకరు. కలర్స్ అనే షో ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న స్వాతి అనంతరం సినిమాల్లో అవకాశాలను అందుకుంటూ హీరోయిన్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు.
ఈమె కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం మలయాళం సినిమాలలో కూడా నటించి స్టార్ హీరోయిన్గా సక్సెస్ అయ్యారు అయితే ఈమె కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే వికాస్ వాసు అనే వ్యక్తిని 2018 వ సంవత్సరంలో పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లి అక్కడి స్థిరపడ్డారు అయితే కొంతకాలం పాటు విదేశాలలో ఉన్న ఈమె సినిమాలకు దూరం అయ్యారు.
ఇక ఇటీవల తిరిగి ఇండియా వచ్చిన స్వాతి తిరిగి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అయితే తాజాగా ఈమెకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఈమె తన భర్త వికాస్ వాసుకు విడాకులు ఇవ్వడం వల్లే తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చారని స్పష్టమవుతుంది గతంలో తన పెళ్లి ఫోటోలను డిలీట్ చేసిన ఈమె తాజాగా తన భర్తను కూడా అన్ ఫాలో చేశారు. ఇలా సోషల్ మీడియాలో తన భర్తను అన్ ఫాలో చేయటంతో ఈమె తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయారని కానీ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు అంటూ మరోసారి స్వాతి విడాకుల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.