TG: నేను ఓడిపోతే నా ముక్కును నేలకు రాస్తా…. బీజేపీ, బిఆర్ఎస్ సవాల్ విసిరిన రేవంత్!

TG: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 12 నెలల పాలనపై చర్చించడానికి పదేళ్లు తెలంగాణను పాలించిన బిఆర్ఎస్,బీజేపీకి సవాల్ విసిరితో తాను చర్చలకు సిద్ధమని మీరు కూడా సిద్ధమ అంటూ ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకుంది.

ఈ క్రమంలోనే శుక్రవారం నారాయణపేట్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. పదేళ్లు అధికారంలోకి ఉండి కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారో.. పన్నెండేళ్లుగా కేంద్రంలోని బీజేపీ, ఏడాదిలోనే తామేం చేశామో చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు టైం స్థలం ఎక్కడో చెబితే నేనే అక్కడికి వచ్చి చర్చిస్తానని తెలిపారు. ఈ చర్చలలో కనుక తాను ఓడిపోతే అక్కడే నా ముక్కును నేలకు రాస్తాను అంటూ రేవంత్ రెడ్డి తెలిపారు.

గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ చేయలేని అభివృద్ధిని 12 నెలల కాలంలో మేము చేశామని రేవంత్ తెలిపారు. ఈ 12 నెలల కాలంలో తెలంగాణలో అభివృద్ధి జరిగినట్లు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.. పదేళ్లలో ఏ ఒక్కరికైనా కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చారా? అని ప్రశ్నించారు.

కెసిఆర్ 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ పాలమూరు పనులు మాత్రం పూర్తి కాలేదు. పాలమూరు వలసలను ఆపడం కోసం ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు తాము ప్రయత్నిస్తుంటే.. మళ్లీ ప్రభుత్వాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మంచి చేస్తున్న మనపై కుట్రలు చేయడానికి కొంతమంది కడుపులో కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారు అలాంటివారికి మీరు సరైన గుణపాఠం చెప్పాలి . రాష్ట్ర వ్యాప్తంగా మంచి పనులు చేసే బాధ్యత నాది.. నన్ను కాపాడుకునే బాధ్యత మీది అంటూ రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.