తెలంగాణ వార్షిక బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారు కోసం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులు, అధికారులు హాజరు కానున్నారు. బడ్జెట్ సమావేశాలను మార్చి 28న కంటే ముందే ముంగిచాలని స్రభుత్వం భావిస్తోంది, యాదాద్రి ఆలయం మహాకుంభ సంప్రోక్షణ ఉన్న నేపథ్యంలో సమావేశాలను తొందరగా ముగించాలని చూస్తోంది. బడ్జెట్ సమావేశాలు 12 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఇటీవల కేసీఆర్ సంకేతాలు ఇచ్చారు. బడ్జెట్‌పై ఏ రోజు ప్రవేశపెట్టాలో దానిపై ఈ రోజు చర్చించనున్నారు. వార్షిక బడ్జెట్ తేదీల ఖరారు అనంతరం ఆమోదం కోసం గవర్నర్ తమిళిసైకు పంపనున్నారు.