నీచుడు.. డ్రగ్స్ ఇచ్చి ఒకేరోజు 17 మందిపై అగాయిత్యం చేసిన ప్రిన్సిపాల్!

ఉత్తరప్రదేశ్ లో ఒక దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు చదువులు చెప్పి పాఠాలు నేర్పించాల్సిన గురువు విద్యార్థుల పాలిట కాలయముడయ్యాడు. పదవ తరగతి విద్యార్థులకు ప్రిన్సిపాల్ అతడి సహచరుడు కలిసి డ్రగ్స్ ఇచ్చి లైంగిక దాడికి పాల్పడిన దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాల్లో చోటు చేసుకుంది.

ఒక పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌కు ప్రిపరేషన్ పేరుతో 17 మంది విద్యార్థినులను పాఠశాలలోనే రాత్రికి ఉండాలని మాయమాటలు చెప్పి ఆ విద్యార్థులు తినే ఆహారంలో మత్తు మందు కలిపి,వారు స్పృహ‌కోల్పోయిన తర్వాత లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ విద్యార్థులకు మెలకువ వచ్చి చూసేసరికి అదే ప్రాంతంలోని మరో పాఠశాలలో ఉన్నారు. నవంబర్ 18న జరిగిన ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో సంచలనంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను పట్టుకోవడానికి ఐదు బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం.

ఈ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను విధుల నుంచి తప్పించినట్లు ముజఫర్ నగర్ ఎస్పీ అభిషేక్ యాదవ్ వెల్లడించారు. నిందితుల పై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ఆయన వివరించారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పినా వినిపించుకోలేదని, ఆ తరువాత స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకున్న తర్వాత తన ఫిర్యాదును పోలీసులు స్వీకరించారని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు.