టాలీవుడ్ టాప్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. ప్రస్తుతం పలు మాస్ అండ్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న పవన్ తన కెరీర్ లో ఎందరో స్టార్ దర్శకులతో వర్క్ చేశారు. కానీ సెన్సేషనల్ దర్శకుడు రాజమౌళితో ఓ సినిమా చేస్తే చూడాలని అంతా ఎప్పుడు నుంచో అనుకుంటున్నారు. కానీ ఈ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో గాని ఆల్రెడీ వీరి కాంబోలో ఓ సినిమా అనుకొనే ఆగిపోయిందట.
అసలు విషయం లోకి వెళితే రాజమౌళి తన మగధీర, యమదొంగ సినిమాలకు ముందే పవన్ ని కలిసి ఓ సినిమా కోసం మాట్లాడారట. అప్పుడు పవన్ తనతో ఆ సినిమా ఈ సినిమా అని లేదు ఏదైనా చేస్తానని చెప్పారట. అలా చెప్పి ఓ నెల తర్వాత కాల్ చేస్తానని చెప్పారట. కానీ అప్పుడు తన సినిమాల్లో బిజీగా ఉండి చెయ్యలేదు అని తెలిపారు.
దీనితో సినిమా ఆగిపోయిందట. ఇక ఆ తర్వాత తాను భారీ సినిమాలు తియ్యడం పవన్ కూడా రాజకీయాలులో ఎక్కువగా బిజీ ఉండడంతో తాను తీసే సినిమాలు ఎక్కువ రోజులు షూటింగ్ జరుపుకునేవిగా మారడం మరింత దూరం పెంచాయని రాజమౌళి తెలిపారు. అయినా కూడా పవన్ పై ప్రేమ, గౌరం ఎప్పటికీ ఒకేలా ఉంటాయని తెలిపారు.