తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర మాత్రేమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక బిగ్గెస్ మాస్ పర్సనాలిటీ మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటి వరకు తన కెరీర్ లో అయితే తాను చూడని ఎత్తు పళ్ళాలు లేవు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి అయితే తాను భారీ తప్పు చేసారని చాలా మంది అంటారు.
కానీ ఇప్పుడు ఏదైతే అది అయ్యింది మళ్ళీ తనకి అన్నం పెట్టిన మరో అమ్మ సినిమా లలోనే మెగాస్టార్ మళ్ళీ బిజీగా మారారు. అయితే ఇప్పటికీ కూడా మెగాస్టార్ సినిమాలు చేస్తున్న రాజకీయ అంశాలు ఎక్కడో దగ్గర లింక్ అవుతూనే ఉంటాయి.
మరి వీటితో పాటుగా అప్పుడు చిరంజీవి పెట్టిన “ప్రజా రాజ్యం” పార్టీ విషయంలో ఇప్పటికీ తనపై ఓ కామెంట్ ఏ ఊరిలో అయినా వినిపిస్తుంది. చిరు కానీ ఇప్పటికీ తన ప్రజా రాజ్యం పార్టీ ని కొనసాగించి ఉంటే తప్పకుండా తాను సీఎం అయ్యి ఉండేవారని అంటారు.
మరి ఈ కొనసాగింపు అనే మాట లేటెస్ట్ గా తనకి ఎదురు కాగా దీనిపై చిరు హాట్ కామెంట్స్ చేసారు. తనకి ఇప్పుడే బాగుంది అని అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులు వేరు ఇప్పుడు ఒకవేళ కొనసాగి ఉంటే తెలంగాణాలో కాకుండా ఆంధ్రా ప్రదేశ్ లోనే తాను ఉండే వాడిని అని బిగ్ కామెంట్స్ చేసారు.
కానీ తనకి అయితే సినిమా పరంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రేమ దక్కుతుంది అని అందుకే ఇప్పుడు సినిమాల్లో ఉండడమే బాగుంది అని అసలు మాట బయట పెట్టారు.