Chiru Leaked A Interesting Dialogue : మెగా లీక్ : “భవదీయుడు భగత్ సింగ్” నుంచి క్రేజీ డైలాగ్ లీక్ చేసిన చిరు.!

Chiru Leaked A Interesting Dialogue

Chiru Leaked A Interesting Dialogue : గాడ్ ఆఫ్ మాసెస్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ చిత్రాల్లో దర్శకుడు హరీష్ శంకర్ తో చేయనున్న భారీ సినిమా “భవదీయుడు భగత్ సింగ్” కూడా ఒకటి. దీనిపై ఎన్నో అంచనాలు నెలకొనగా ఇదే చిత్ర దర్శకుడు లేటెస్ట్ గా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న మెగా బిగ్ మల్టీ స్టారర్ సినిమా “ఆచార్య” హీరోలు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ మరియు దర్శకుడు కొరటాల శివ తో ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ తీసుకున్నాడు.

అయితే ఈ ఇంటర్వ్యూ అంతా మంచి ఆసక్తిగా కొనసాగగా లాస్ట్ లో ఈ హరీష్ శంకర్ పవన్ తో చేయబోయే భవదీయుడు భగత్ సింగ్ లో డైలాగ్ ని మెగాస్టార్ చిరు లీక్ చెయ్యడం ఆసక్తిగా మారింది. అయితే ఆ డైలాగ్ మొదట చిరు చెప్తానని చెప్పగా ఆ సమయంలో దర్శకుడే అందుకొని లీక్ చేసారు.

పవన్ ని విలన్ చూసి చెప్పే సన్నివేశం అది కాగా డైలాగ్ ఏమిటంటే పవన్ నడిచి వస్తే లక్షలాది మంది ఉన్నారనేదేనా వీడి ధైర్యం అంటాడు అయితే దానికి ఆ విలన్ అసిస్టెంట్ అది కాదు సార్ ఆ లక్ష మందికి ఇతను ముందు ఉన్నాడు అని ధైర్యం అని చెప్తాడు.

దీనితో ఈ డైలాగ్ కి చిరు చరణ్ సహా దర్శకుడు కొరటాల శివ కూడా స్టన్ అయ్యి చప్పట్లు కొట్టారు. అలాగే లాస్ట్ లో అయితే ఇదే డైలాగ్ ని చిరు తన తమ్ముడు ని ఉద్దేశించి తనదైన శైలిలో చెప్పగా దీనితో ఈ మెగా లీక్ అది భారీ ఎత్తున వైరల్ గా మారిపోయింది. ఇలా ఈ ఆచార్య ఇంటర్వ్యూ పవర్ ఫుల్ డైలాగ్ తో ఎండ్ అయ్యింది.