మెగాస్టార్ చిరంజీవి కొన్ని దశాబ్దాలుగా తన నటనతో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నారు. ఆరుపదుల వయస్సులోను అదే ఉత్సాహంతో సినిమాలు చేస్తుండగా,మెగాస్టార్ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఖైదీ నెం 150 చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన చిరు వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తుండగా, ఈ సినిమా మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కొరటాల శివ సినిమా పూర్తయ్యాక చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ చేయనున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటికి అనుగుణంగా తెరకెక్కించనున్నారు. మరోవైపు వేదాళం రీమేక్‌లోను చిరు నటించనుండగా, ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. అతి త్వరలోనే ఈ మూవీ కూడా సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సర్ధార్ గబ్బర్ సింగ్ అనే సినిమా చేసి బాబీ ఇప్పుడు చిరంజీవితోను ఓ సినిమా చేయనున్నాడు.
బాబీ- చిరంజీవి ప్రాజెక్ట్‌కు సంబంధించి గతంలోనే అఫీషియల్ ప్రకటన రాగా, ఈ సినిమాను ఎవరు నిర్మిస్తారు? చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందనే అనుమానం అభిమానులలో ఉండేది. దీనిని ఉప్పెన్ ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ తొలగించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలియజేశారు. మైత్రి మూవీ మేకర్స్ ప్రస్తుతం ఆచార్య సినిమాతో పాటు నాని, విజయ్ దేవరకొండతో సినిమాలని నిర్మిస్తోంది . ఇదే కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు-పరుశురామ్ సినిమాను కూడా మైత్రీ మూవీస్ నిర్మిస్తుందని తెలుస్తోంది. మంచి సక్సెస్‌లతో దూసుకెళుతున్న మైత్రి మూవీ మేకర్స్ రానున్న రోజులలో మరెన్నో అద్భుతాలు చేస్తామంటుంది.