తిరుపతి పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడుతూ చిరంజీవి లాంటి బలమైన నేత ఇప్పటివరకు నిలబడి ఉంటే ఖచ్చితంగా సీఎం అయ్యేవాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తిరుపతి లో చిరు పేరును తెరమీదకు తీసుకోని రావటం వెనుక పెద్ద ప్లాన్ ఉందని తెలుస్తుంది.
అన్నయ్య పార్టీ పెట్టి తిరుపతిలో సభ పెడితే 10 లక్షల మంది జనం వచ్చారు. అలాంటి బలమైన వ్యక్తిని కూడా మనం కాపాడుకోలేకపోయాం, ఆయనే ఉండి ఉంటే కచ్చితంగా సీఎం అయి ఉండేవారంటూ కార్యకర్తలందర్నీ ఊహాలోకంలోకి తీసుకెళ్లారు. పనిలో పనిగా చిరంజీవి అభిమానుల్ని, ప్రజారాజ్యానికి పనిచేసిన అప్పటి కార్యకర్తల్ని కూడా దగ్గర చేసుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తమ సామాజిక వర్గాన్ని తిరుపతిలో ఏకం చేసేందుకే పవన్ కల్యాణ్ ప్రయాస పడుతున్నట్టు అర్థమవుతోంది.
నిజానికి నివర్ తుఫాన్ ప్రభావం ఒక్క తిరుపతిలోనే కాదు, ప్రకాశం, నెల్లూరు , అనంతపురం లో కూడా తుఫాన్ ఎఫెక్ట్ గట్టిగానే ఉంది, కానీ పవన్ కళ్యాణ్ కు మాత్రం కేవలం తిరుపతి మాత్రమే గుర్తుకువచ్చింది. డైరెక్ట్ గా తిరుపతి వస్తే బాగోదని ముందు రోజు కృష్ణ, గుంటూరు లో పర్యటన చేసి చివరికి తన టార్గెట్ చేరుకున్నాడు ప్రస్తుతం తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా జనసేనకు టికెట్ ఇప్పించుకుని అభ్యర్థిని గెలిపించుకోవడం పవన్ ముందున్న ఏకైక అజెండా. అందుకే అటు సినిమాలకు సైతం గ్యాప్ ఇచ్చి.. రైతు పరామర్శ యాత్రల పేరుతో తిరుపతికి చేరుకున్నారు.
2009 ఎన్నికల్లో చిరంజీవి రెండు స్థానాల్లో పోటీచేశాడు, అయితే సొంత ఊరి జనాలు చిరంజీవిని ఓడిస్తే, తిరుపతి ప్రజలు తమ అక్కున చేర్చుకున్నారు. అయితే ఆ తర్వాత చిరంజీవి తిరుపతి విషయంలో పెద్దగా చేసిందేమి లేదనే మాటలు వినిపిస్తున్నాయి.
ఎంపీ అయిన తర్వాత కూడా తిరుపతి గాలికి వదిలేసాడు తప్ప అటు వైపు కన్నెత్తి చూడలేదని తెలుస్తుంది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిరుపతిలో చిరంజీవి పేరును వాడుకొని ఎన్నికల్లో గట్టిపోటీ ఇవ్వాలని భావిస్తూ వ్యూహాత్మకముగా ఆయన పేరును వాడుకుంటున్నాడు, మరి అది ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుందో చూడాలి