మన సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం లేదు. ఓ ఇద్దరు ముగ్గురు తప్ప వారి పక్కన వేరే ఎవ్వరూ సెట్ కావట్లేదు. వాళ్ళతోనే మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాల్సి వస్తోంది. అందుకే ప్రత్యామ్నాయాలు వెతుక్కునే పనిలో ఉన్నారు అందరూ. బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకీ ఇలా అందరిదీ ఇదే సమస్య. కమర్షియల్ సినిమాలు చేసేటప్పుడు ఈ ఇబ్బందీ మరీ ఎక్కువగా ఉంటోంది. ఇప్పటికే చిరు హీరోయిన్ల కొరతతో కాజల్ అగర్వాల్ ను రిపీట్ చేశారు. ‘ఖైదీ నెం 150’ తర్వాత ‘ఆచార్య’లో ఆమెతో వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాకు అంటే ఏదోలా అడ్జెస్ట్ చేశారు కానీ నెక్స్ట్ ఆయన మూడు సినిమాలు చేయాల్సి ఉంది.
వాటిలో ప్రధాన సమస్య కథానాయకే. ‘లూసిఫర్’ రీమేక్ కోసం నయనతారను అనుకుంటున్నారు. మెహర్ రమేష్, బాబీ సినిమాల్లో ఎవర్ని తీసుకోవాలనేది ఇంకా క్లారిటీ రాలేదు. నిజానికి టాలీవుడ్లో ఎవ్వరూ లేరు కూడ. అందుకే బాలీవుడ్లో వెతకడం స్టార్ట్ చేశారట. బాబీ సినిమాకు సోనాక్షి సిన్హాను అప్రోచ్ అవ్వాలనే ఆలోచనలో ఉన్నారట చిరు టీమ్. మరి అది ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. ఏది ఏమైనా మన ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్ల కొరతతో పక్క ఇండస్ట్రీల హీరోయిన్ల వద్దకు పెద్ద పెద్ద అవకాశాలు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.