రాజమౌళి తో సినిమా చెయ్యను అంటున్న చిరంజీవి

ప్రస్తుతం ఇండియా మొత్తం లో రాజమౌళి ని మించిన దర్శకుడు లేదు. ఆయన ఇప్పుడు ఇండియన్ డైరెక్టర్. అలాంటి రాజమౌళి సినిమాలో నటించడానికి ఎంత పెద్ద స్టార్ అయినా కానీ ఒకే అంటాడు. కానీ చిరంజీవి మాత్రం రాజమౌళి తో సినిమా చెయ్యడానికి రెడీ గా లేడంట.

ఒకప్పుడు డైరెక్టర్ శంకర్ తో కనీసం ఒక్క సినిమా అయినా చెయ్యాలని ఆశపడ్డ చిరంజీవి రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ సినిమా చెయ్యకూడదు అనుకోవడం కొంతమందికి ఆశ్చర్యంగా అనిపించింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా చిరును జర్నలిస్ట్ జక్కన్న తో ఎందుకు సినిమా చేయను అని చెప్పారు అని అడుగగా అందుకు చిరు ఆన్సర్ ఇచ్చారు.మన తెలుగు సినిమా ఖ్యాతిని మాత్రమే కాదు ఇండియన్ సినిమా ఖ్యాతిని నేషనల్ స్థాయిలో చాటి చెప్పిన అద్భుతమైన డైరెక్టర్ రాజమౌళి అని.ఆయన కథ అన్నప్పటి నుండి 5 ఏళ్ళు అయినా సినిమా పూర్తి చేయడానికి తీసుకుంటారు.

ఆ సినిమా చేయాలంటే ఆయనతో 5 ఏళ్ళు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది.కానీ నేని ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేయాలని అనుకుంటున్నాను.అందుకే మా ఇద్దరికీ సెట్ అవ్వదు అంటూ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మూవీ ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత బాబీ దర్శకత్వం లో ఒక సినిమా, అలాగే మెహెర్ రమేష్ తో కూడా ఒక సినిమా చెయ్యనున్నారు మెగాస్టార్ చిరంజీవి.