చరణ్ సాంగ్ పై చిరంజీవి రియాక్షన్ ఎలా ఉందంటే.!

మెగాస్టార్ చిరంజీవి అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిపి నటించిన చిత్రాలు ఇది వరకే కొన్ని ఉన్నాయి కానీ అవేవి పెద్దగా స్పేస్ లేనివి అంతగా హిట్ కానివి కానీ “మగధీర” అలా కాదు. మళ్ళీ ఆ సినిమా తర్వాత ఇద్దరికీ ఒకే స్క్రీన్ పై చూసేందుకు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మాత్రం “ఆచార్య”.

భారీ అంచనాలుతో ఉన్న ఈ చిత్రం నుంచి ఈరోజు రెండో సాంగ్ నీలాంబరి వచ్చింది. చరణ్, పూజా హెగ్డే ల పై డిజైన్ చేసిన ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంటుండగా వీరి సాంగ్ పై మెగాస్టార్ చిరంజీవి తన రియాక్షన్ ని తెలిపారు.

మణిశర్మ ని మెలోడీ బ్రహ్మ మణిశర్మ అని ఎందుకు అంటారో ఈ నీలాంబరి సాంగ్ మళ్ళీ ఋజువు చేసింది అని కొనియాడారు. దీనిని బట్టి సాంగ్ ఏ లెవెల్లో వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే అంతా ఈ సాంగ్ విని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సాంగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న రిలీజ్ అవుతుంది.