Sai Pallavi: సాయి పల్లవి జీవితాన్నే మార్చేసిన చిరు…. అసలేం జరిగిందో తెలుసా?

Sai Pallavi: సినీ నటి సాయి పల్లవి ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. కేవలం సౌత్ సినిమాలు మాత్రమే కాకుండా ఈమె బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే సాయి పల్లవి ఇలా స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్నారు అంటే అందుకు కారణం మెగాస్టార్ చిరంజీవి అని తెలుస్తోంది. అసలు సాయి పల్లవి కెరియర్ కు చిరంజీవికి సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే….

మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఈయన ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా ఇండస్ట్రీలోకి వచ్చి తన కృషితో పట్టుదలతో ఇండస్ట్రీలో ఈ స్థాయికి వచ్చారు. ఇక చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది ఇండస్ట్రీలోకి వచ్చి నేడు హీరోలుగాను లేదా కొరియోగ్రాఫర్లుగా, లేదా ఇండస్ట్రీలో ఏదో ఒక విభాగంలో స్థిరపడి ఉన్నారు.

ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన వారంతా కూడా తాము చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చాము అంటూ చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే సాయి పల్లవి కూడా చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చినట్టు ఇటీవల ఒక సందర్భంలో బయటపెట్టారు. చిరంజీవి నటన మాత్రమే కాదు డాన్స్ కూడా ఎంతో అద్భుతంగా చేస్తారనే సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే చిరంజీవి నటించిన ముఠామేస్త్రి సినిమాని చూసిన సాయి పల్లవి ఆ క్షణమే ఆమె కూడా డాన్సర్ అవ్వాలని కోరుకున్నారట. ఈ సినిమాలో చిరంజీవి డాన్స్ అద్భుతంగా చేయటంతో ఆ సినిమాని చూసిన సాయి పల్లవి తాను కూడా అలా గొప్ప డాన్సర్ కావాలన్న పట్టుదలతో డాన్స్ నేర్చుకొని అనంతరం ఇండస్ట్రీలోకి కూడా హీరోయిన్గా అడుగు పెట్టారని తెలుస్తుంది.

ఇక సాయి పల్లవి అద్భుతమైన డాన్సర్ అనే విషయం తెలిసిందే. ఇక ఈమె ఢీ డాన్స్ షోలో సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక ప్రస్తుతం నటిగా ఇండస్ట్రీలో కూడా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇలా తాను ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉండటానికి చిరంజీవి కారణమని తెలియజేయడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.