ఇంకో రీమేక్ కి రెడీ అవుతున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో కి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. తన కంబ్యాక్ మూవీ ‘ఖైదీ నో 150 ‘ ని తమిళ్ ‘కత్తి’ సినిమానుండి రీమేక్ చేసిన చిరంజీవి తన లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ కూడా మలయాళం ‘లూసిఫెర్’ కి రీమేక్. దసరా కి విడుదలయిన ఈ మూవీ ఇప్పటికే హిట్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది.

ప్రస్తుతం మెహెర్ రమేష్, బాబీ సినిమాలతో బిజీ గా ఉన్న చిరంజీవి ఇంకో రీమేక్ సినిమాతో రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. మమ్ముట్టి హీరో గా వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘భీష్మ పర్వం’ రీమేక్ రైట్స్  రామ్ చరణ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం కి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ సినిమా గురించి ఇంకా ఆఫిసిఅల్ గా అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. బహుశా ప్రస్తుతం ఉన్న సినిమాలు పూర్తి చేసాక చిరంజీవి ఈ రీమేక్ మూవీ లో నటిస్తాడేమో చూడాలి.