Chiranjeevi: చరణ్ కి కొడుకు పుట్టాలి…. నా వారసత్వం కొనసాగించాలి… ఇంట్లో లేడీస్ హాస్టల్ లా ఉంది: చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని కొనసాగిస్తూ రామ్ చరణ్ కూడా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి వారసుడిగా చరణ్ ఇండస్ట్రీలో తండ్రికి మించిన తనయుడిగా గుర్తింపు పొందారు. ఈయన కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపు పొందారు. ఇక మెగా వారసత్వాన్ని కంటిన్యూ చేయాలి అంటే తప్పనిసరిగా రామ్ చరణ్ కి కొడుకు ఉండాలనే అభిమానులు కూడా భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే రామ్ చరణ్ కు పెళ్లి జరిగిన 12 సంవత్సరాలకు ఇటీవల కుమార్తె జన్మించారు.. ఇక తనకు కుమార్తె జన్మించినప్పటికీ మెగా అభిమానులలో ఎక్కడో కొంత వారసుడు ఉండి ఉంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవికి కూడా మనవడు కావాలని తన వారసత్వాన్ని కొనసాగించాలని కోరిక ఉందని తాజాగా బయటపెట్టారు.

తాజాగా రాంచరణ్ బ్రహ్మానందం నటించిన బ్రహ్మ ఆనందం సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన ఇల్లు మొత్తం మనవరాళ్లతో నిండిపోయింది. తాను ఇంట్లో ఉంటే కనుక ఏదో లేడీస్ హాస్టల్ లో ఒక వార్డెన్ లాగా ఉన్నాను అనే భావన నాకు కలుగుతుంది. అందుకే రామ్ చరణ్ కు కొడుకు పుట్టాలని కోరుకుంటున్నాను.

చరణ్ కు కొడుకు పుట్టి నా వారసత్వాన్ని కొనసాగించాలని కోరుతూ ఉంటాను. అందుకే ఇంట్లో కూడా ఎప్పుడు చరణ్ ను ఈసారి ఒక అబ్బాయిని కనురా అని అడుగుతూ ఉంటాను. వాడెక్కడ మరోసారి కూతురికి జన్మనిస్తారేమోనని భయంగా ఉంది అంటూ చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.