“ఆచార్య” లాసులు..తమ రెమ్యునరేషన్స్ పై చిరు షాకింగ్ కామెంట్స్.!

Acharya Coming Early In OTT

డెఫినెట్ గా ఈ ఏడాది వచ్చినటువంటి పలు దారుణ పరాజయ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మంచి మోస్ట్ అవైటెడ్ గా వచ్చిన మల్టీ స్టారర్ చిత్రం “ఆచార్య” కూడా ఒకటి. దర్శకుడు కొరటాల శివతో చేసిన ఈ సినిమాలో అయితే మెగా వారసుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించాడు. దీనితో ఈసినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

అలా రిలీజ్ అయ్యిన ఈ చిత్రం భారీ మొత్తంలో బిజినెస్ కూడా జరిపింది కానీ సీన్ కట్ చేస్తే సినిమాకి సగానికి పైగా లాసులే మిగిలాయి. దీనితో అక్కడ నుంచి ఈ సినిమా నష్టాల విషయంలో టాలీవుడ్ లో ఎన్నో వార్తలు కూడా వచ్చాయి.

మరి ఫైనల్ గా అయితే ఈ లాసులపై మెగాస్టార్ నుంచే అసలు సమాధానం బయటకి వచ్చింది. ఈ సినిమాకి తాము చెయ్యాల్సింది చేశామని కానీ అనుకున్న స్థాయిలో సినిమా రాణించలేదు. ఈ సినిమాకి వచ్చిన నష్టాల నిమిత్తం నేను చరణ్ కూడా 80 శాతం రెమ్యునరేషన్ లు వెనక్కి ఇచ్చేశామని షాకింగ్ అంశం బయట పెట్టారు.

డిస్ట్రిబ్యూటర్ లు నష్టాలు పాలు అయ్యినప్పుడు ఆ భాద్యత మేము తీసుకుంటామని ఆచార్య ఫలితం విషయంలో నేను ఎలాంటి గిల్టీ జి=ఫీల్ అవ్వట్లేదని చిరు అయితే ఈ అంశంపై ఒక ముగింపు ఇచ్చారు.