‎Chiranjeevi: స్టేజ్ పైనే చిరంజీవి పరువు తీసేసిన సుస్మిత కొణిదెల.. స్టెప్స్ మర్చిపోయారు అంటూ!

Chiranjeevi: టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాల్లో నటిస్తూ ఈతరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు. సినిమా హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇకపోతే చిరంజీవి డాన్స్ కి సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

‎చిరు మాస్ గా రెండు స్టెప్పులు వేస్తే చాలు థియేటర్లు దద్దరిల్లి పోవాల్సిందే. ఇది ఇలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి డాన్స్ గురించి ఆయన కూతురు సుస్మిత చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కిందపురి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ కి చిరంజీవి కూతురు, నిర్మాత సుస్మిత కొణిదెల గెస్ట్ గా హాజరయ్యారు. స్టేజిపై సుస్మిత మాట్లాడిన అనంతరం సుమ చిరంజీవి గారు మీ అమ్మకు భయపడతారా అని సరదా ప్రశ్న అడగ్గా సుస్మిత నేడు జరిగిన ఆసక్తికర సంఘటన తెలిపింది.

‎ ఈ సందర్బంగా సుస్మిత కొణిదెల మాట్లాడుతూ.. ఇవాళ శంకర వరప్రసాద్ సినిమా సాంగ్ షూట్ చేస్తున్నాము. ఇవాళ షూట్ ప్లేస్ కి మా అమ్మ వచ్చింది. అప్పటిదాకా నాన్న డ్యాన్స్ బాగానే చేస్తున్నారు. అమ్మ వచ్చి కూర్చోగానే స్టెప్ అటు ఇటు అవ్వడం, స్టెప్స్ మర్చిపోవడం చేసారు. అమ్మ నాన్నను కొంచెం ఎఫెక్ట్ అయితే చేసింది అని అర్ధం అవుతుంది అని తెలిపింది. దీంతో ఎంత మెగాస్టార్ అయినా భార్యకు భయపడతారన్నమాట అని సుమ సరదాగా కామెంట్ చేసింది. ఈ సందర్బంగా సుస్మిత చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.