Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో మెగా అల్లు కుటుంబాల మధ్య దూరం పెరుగుతూనే ఉందని చెప్పాలి. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి కాకుండా వైకాపా నాయకులకు మద్దతు తెలపడంతోనే ఈ విభేదాలు చోటుచేసుకున్నాయి. అప్పటినుంచి ఈ రెండు కుటుంబాల మధ్య దూరం బాగా పెరిగిపోయింది అయితే అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో చిరంజీవి నాగబాబు వెంటనే అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
అనంతరం అల్లు అర్జున్ జైల నుంచి బయటకు వచ్చిన తర్వాత చిరంజీవి నాగబాబు ఇంటికి వెళ్లి వారితో కలిసి కాసేపు మాట్లాడి రావడంతో రెండు కుటుంబాల మధ్య విభేదాలు తొలగిపోయాయని అందరూ భావించారు. కానీ ప్రస్తుతం వ్యవహారం చూస్తుంటే ఈ రెండు కుటుంబాల మధ్య అలాగే విభేదాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే పుష్ప సినిమా మంచి సక్సెస్ కావడంతో రామ్ చరణ్ కానీ చిరంజీవి కానీ ఇప్పటివరకు ఎక్కడ స్పందించిన దాఖలాలు కూడా లేవు.
ఇలాంటి తరుణంలో ప్రస్తుతం చిరంజీవి పుష్ప సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. విశ్వక్ హీరోగా నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇండస్ట్రీ గురించి చిరంజీవి మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో నందమూరి కాంపౌండ్ అక్కినేని కాంపౌండ్ మెగా కాంపౌండ్ అంటూ ఏమీ లేవని మేమంతా ఒక్కటేనని తెలిపారు.
ఇండస్ట్రీలో ఏ హీరో సినిమా సక్సెస్ అయినా అందరం సంతోషించాలి. ఎందుకంటే ఆ నిర్మాత మళ్లీ మాతో సినిమా చేస్తాడు అని తెలిపారు. ఇక మా ఇంట్లో చాలామంది హీరోలు ఉన్నారు మేమందరం చాలా కలిసి మెలిసి ఉంటామని తెలిపారు. ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా గురించి కూడా ప్రస్తావనకు వచ్చింది ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 పెద్ద హిట్ అయ్యింది, దానికి నేను గర్విస్తాను.
ఇండస్ట్రీ అన్న తర్వాత ఎన్నో సినిమాలు వస్తుంటాయి అయితే కొన్ని సినిమాలు ఆడుతాయి మరికొన్ని సినిమాలు ఆడవు. ఇక సినిమా మంచి సక్సెస్ అయ్యింది అంటే ఆ సినిమా సక్సెస్ గురించి ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా గర్వించాలి అంటూ చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.