లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన పెద్ద సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ కూడ ఒకటి. సెకండ్ వేవ్ లేకుండా ఉంటే ఈపాటికి సినిమా కంప్లీట్ అయి రిలీజ్ కూడ ఆయ్యుండేది. షూటింగ్ ఆగిపోయే సమయానికి కేవలం 15 రోజుల సినిమా మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అందుకే ఈసారి వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేయాలని చిరంజీవి డిసైడ్ అయ్యారు. ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ నిబంధనలు తొలగుతున్నాయి. సినిమా షూటింగ్స్ రీస్టార్ట్ అవుతున్నాయి. ‘ఆచార్య’ను కూడ జూలై నెలలో మొదలుపెడతారు.
ఏకధాటిగా సింగిల్ షెడ్యూల్లో చేస్తే 15 రోజుల్లో సినిమా కంప్లీట్ అవుతుంది. చిరంజీవి, రామ్ చరణ్ మీద కొన్ని కీలక సన్నివేశాలు, ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. వీటి కోసం స్పెషల్ సెట్ వేశారు. జూలై ఆరంభంలో షూట్ మొదలుపెడితే మధ్యలోకి చిత్రీకరణ ముగించి, నెలాఖరుకు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేయాలని చూస్తున్నారట. ఎందుకంటే ఈ లాక్ డౌన్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలావరకు పూర్తయ్యాయట. కాబట్టి షూటింగ్ అనంతరం పనుల మీద ఎక్కువ రోజులు వెచ్చించాల్సిన అవసరం లేదు. సో.. ఆగష్టు ఆరంభానికి అన్ని ఫార్మాలిటీస్ ముగించి రెండు లేదా మూడవ వారంలో రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట చిరంజీవి. దర్శకుడు కొరటలా శివ సైతం చిరంజీవి ప్రణాళికతో ఏకీభవించి అందుకు అనుగుణంగా షెడ్యూల్ సిద్ధం చేసుకుంటున్నారట.