మెగా ఇంట్లో వంటల కార్యక్రమం.. మనవరాళ్ల కోరికను తీర్చిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి వెండితెరపైనే కాదు వంటగదిలోనూ రారాజు. వంటగదిలో దూరి గరిట తిప్పాడంటే చాలు ఘుమఘుమలు రావాల్సిందే. చిరంజీవి చేసే స్పెషల్ దోశ ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. చిరు దోశె అంటూ స్టార్ హోటల్స్ మెనూలో ప్రత్యేకంగాఉంటుంది. అదే చిరు సత్తా అంటే. వంటలు వండటంలో మాస్టర్ చెఫ్ లాంటివాడు. ఆ మధ్య లాక్డౌన్‌లో తన అమ్మకు ఎంతో ప్రేమతో స్పెషల్‌గా వండిపెట్టిన సంగతి తెలిసిందే.

Chiranjeevi Cook KFC Chicken For Nivruthi And Samhitha
Chiranjeevi Cook KFC Chicken For Nivruthi And Samhitha

చికెన్, రొయ్యలు ఇలా నాన్ వెజ్ ఐటెమ్స్‌ను చిరు ఇరగ్గొట్టేస్తాడు. చింత చిగురు రొయ్యల పులుసు అంటూ ఆ మధ్య చేసిన వంటకం బాగానే ఫేమస్ అయింది. తన చిన్నతనంలో అమ్మ చేసిన వంటకాన్ని ఇప్పుడు రుచి చూపిస్తానని చెప్పాడు. స్పెషల్‌గా రొయ్యల కూర కూడా చేశాడు. అమ్మకు ప్రేమగా వడ్డించాడు. ఆ వీడియో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. అంతుకు ముందు దోశలు వేసే స్టైల్ కూడా బాగా ఫేమస్ అయింది.

Chiranjeevi Cook KFC Chicken For Nivruthi And Samhitha
Chiranjeevi Cook KFC Chicken For Nivruthi And Samhitha

తాజాగా చిరు తన మనవరాళ్ల కోసం అదిరిపోయే స్నాక్స్ రెడీ చేశాడు. కేఎఫ్‌సీని మించి పోయేలా చికెన్ రెడీ చేశాడు. ఇందుకు కోసం చిరుకు ఇద్దర అసిస్టెంట్లు సాయం చేశారు. సంహిత ( సుష్మిత కూతురు), నివృత్తి (శ్రీజ కూతురు) చిరుకు సాయం చేసి అన్నీ రెడీ చేశారు. చిరు నోరూరించే చికెన్ రెడీ చేశాడు. కేఎఫ్‌సీ కంటే ఎంతో అద్భుతంగా ఉన్నాయంటూ లొట్టలేసుకుంటూ మరీ తినేశారు. ఈ మేరకు చిరు స్పందిస్తూ.. రేపటి తరం అభిరుచికి నచ్చేటట్టు, రుచిగా ఏమన్నా చేయగలిగితే…ఆ కిక్కే వేరప్పా అంటూ సంబరపడిపోయాడు.

https://www.instagram.com/tv/CHDKcPEjifd/?utm_source=ig_web_copy_link