ఆక్సిజన్ కోరతతో కరోనా రోగులు ఎవ్వరూ ప్రాణాలు కోల్పోకూడదనే ఉద్దేశ్యంతో మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంక్స్ నెలకొల్పారు. అనేకమంది ఆక్సిజన్ సిలిండర్లను పొందారు కూడ.
ఈ ఆక్సిజన్ బ్యాంకులను మరింత విస్తృతం చేయడానికి చిరంజీవి కృషి చేస్తున్నారు. తాజాగా ఒక చిన్నారి చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ కోసం తనవంతు సహాయం చేయడం చిరంజీవిని కదిలించింది.
శ్రీనివాస్-హరిణిల కూతురు అన్షి ప్రభాల. జూన్ 1st తన బర్త్‌డే. తను దాచుకున్న డబ్బులతోపాటు పుట్టినరోజు సెలబ్రేషన్స్‌కు అయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా ఆక్సిజన్ బ్యాంకుల కోసం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు ఇచ్చింది. తన చుట్టూ ఉన్న ప్రపంచం బాగున్నప్పుడే అది నిజమైన సంతోషమని ఆ చిన్నారి అంటోంది. ఆమె ఆలోచనకు, మంచి మనసుకు, తన ప్రేమకు ముగ్ధుడినైపోయాను.
అన్షి స్పందించిన తీరు నా హృదయాన్ని తాకింది. నన్ను మరింత ఇన్‌స్పైర్ చేసింది. తన కలలు నిజం కావాలని, ఆమె సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ చిన్నారి చేతుల మీదుగా ఆ భగవంతుడు మా ప్రయత్నానికి చేయూతనిస్తూ ఆశీస్సులను అందిస్తున్నాడని భావిస్తున్నాను. హ్యాపీ బర్త్‌డే, లవ్ యూ డార్లింగ్’ అంటూ వీడియో చేసి ట్విట్టర్లో పెట్టారు. అంతేకాదు ఆ పాపకు తన నుండి బహుమతులు కూడ పంపి అభినందించారు.