Child Artist Annie: లూసర్-3లో కూడా తాను ఉంటుందా, ఉండదా అని తనక్కూడా తెలుసుకోవాలని ఆత్రుతగా ఉందని చైల్డ్ ఆర్టిస్ట్ ఆని అన్నారు. ఇప్పుడు టీం అంతా ఇది సక్సెస్ అవుతుందా, లేదా, ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న టెన్షన్‌లో ఉన్నారని ఆమె చెప్పారు. ఇదంతా అయిపోయాక తానే స్వయంగా డైరెక్టర్‌ను అడుగుతానని ఆమె స్పష్టం చేశారు.
తన కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అంటే అది అక్కినేని నాగార్జున గారి దగ్గరి నుంచే మొదలైందని నటి ఆనీ తెలిపారు. చాలా సంవత్సరాల తర్వాత నాగార్జున గారిని కలవడం చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు. లూసర్ ఈవెంట్‌కి ఆయన వస్తున్నారన్న వార్త తెలియగానే తనకు రాజన్న సినిమాకు సంబందించిన జ్ఞాపకాలన్నీ ఒక్క సారిగా మదిలో మెదిలాయని ఆమె చెప్పారు. సర్‌తో రాజన్న సినిమా చేశానని, మళ్లీ 10 సంవత్సరాల తర్వాత కలుస్తున్నాను. అప్పుడు ఆయనతో సరదాగా మాట్లాడేవారని, మళ్లీ ఇప్పుడు కూడా అంతే బాండింగ్‌తో మాట్లాడుతారో లేదోనని తను అనుకున్నట్టు ఆని అన్నారు.
ఇక లూసర్ ఫ్రీలాంచ్ ఈవెంట్లో తనను నాగార్జున గారు గుర్తుపట్టారని, తన గురించి స్టేజ్ మీద కూడా మాట్లాడారని ఆని చెప్పారు. అసలు తన గురించి అలా స్టేజ్ మీద తన గురించి మాట్లాడుతారని అస్సలు ఊహించలేదని ఆమె అన్నారు. ఆ సమయంలో తనకు చాలా సంతోషంగా అనిపించిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఆ లాంచ్‌కి ఆయన వచ్చినందుకు మరియు తన లైఫ్‌కి టర్నింగ్ పాయింట్ అయినందుకు నాగార్జున గారికి తానెప్పుడూ థ్యాంక్‌ఫుల్‌గా ఉంటానని ఆమె వివరించారు.