Child Artist Annie: లూసర్ 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కి అక్కినేని నాగార్జున గారు రావడం తనకు చాలా ఆనందంగా అనిపించిందని చైల్డ్ ఆర్టిస్ట్ ఆనీ అన్నారు. నిజం చెప్పాలంటే ఆయనకు తన మదర్ చాలా పెద్ద ఫ్యాన్ అని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. ఆ ఈవెంట్‌లో నాగార్జున గారు తన పేరెంట్స్ గురించి, తన మదర్ గురించి అడగడం ఎంతో హ్యాపీగా అనిపించినట్టు ఆమె తెలిపారు. ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని తన గురించి కూడా ఆరా తీసినట్టు ఆనీ చెప్పారు.
ఇకపోతే తాను చిన్నప్పటి నుంచే సినీ ఇండస్ట్రీలో ఉన్నానన్న ఆనీ, డాడీ తనకు ఇంట్రస్ట్ ప్రకారం తన చిన్న వయసులోనే యాక్టింగ్ చేసేందుకు పంపినట్టు తన తల్లి అప్పుడప్పుడు చెప్తూ ఉంటుందని ఆమె తెలిపారు. అలా తాను కూడా కంటిన్యూ అయ్యానని ఆమె చెప్పారు. తాను కూడా ఇష్టంతోనే యాక్టింగ్ చేసేదాన్నని ఆమె చెప్పారు. తనకెప్పుడూ ఈ ఫీల్డ్ అనేది, యాక్టింగ్ అనేది కష్టంగానూ లేదా ఇష్టం లేనట్టుగానూ అనిపించలేదని ఆమె స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా తనకు పర్సనల్‌గా ఇండస్ట్రీలో ఉండాలని, యాక్టింగ్ చేయాలి ఇంకా అని రాజన్న సినిమా చేసిన తర్వాతే అనిపించిందని ఆనీ తెలిపారు. ఆ మూవీలో చేసిన తర్వాత అభిమానుల ఆదరణ చూసి తాను ఆశ్చర్యపోయానని, ఇంతలా అభిమానిస్తున్నారేంటీ అనుకున్నానని ఆమె చెప్పారు. అలా తాను అనుకొని అప్పటినుంచి ఇంకా మరిన్ని సినిమాలు చేస్తే ఇంకా ఆదరిస్తారనే నమ్మకం ఏర్పడిందని, అప్పట్నుంచే తనక్కూడా ఇంట్రస్ట్ పెరుగుతూ వచ్చిందని ఆనీ వివరించారు.