Artist Annie: అతిథి సినిమాను ఎప్పటికీ మర్చిపోను అని చైల్డ్ ఆర్టిస్ట్ ఆనీ తెలిపారు. ఆ సినిమాలో తాను చేసిన ఇంట్రడక్షన్ చాలా ఇష్టం అని, హీరోయిన్ లెవల్‌లో ఇచ్చే ఆ సీన్ తనకు ఎప్పటికీ గుర్తుంటుంది అని ఆమె చెప్పారు. అంతే కాకుండా తాను చేసిన శౌర్యం మూవీలో బ్రదర్, సిస్టర్ ఎమోషన్ అనేది బాగా చూపిస్తారని ఆమె తెలిపారు.
మహేశ్ బాబు గారితో ఇప్పటివరకు రెండు సినిమాలు చేశారని ఆనీ చెప్పారు. రెండు సినిమాలు చేసినా కూడా కాంబినేషన్ మాత్రం ఖలేజా సినిమాలోనే ఉందని ఆమె తెలిపారు. అతిథి సినిమాలో తాను హీరోయిన్ చిన్నప్పటి క్యారెక్టర్ చేశానని, అందుకే ఆయన్ని కలవలేదని ఆమె అన్నారు. ఆయన చాలా బాగా పొలైట్‌గా మాట్లాడుతారని ఆమె చెప్పారు.
ఇకపోతే చిన్నప్పటి నుంచి తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండడం వల్ల తన ఎడ్యుకేషన్ కొంచెం ఈజీ అయిపోయిందని ఆమె అన్నారు. తనకేదైనా ఎగ్జామ్ ఉందంటే తన ఫ్రెండ్స్ ప్రిపరేషన్‌కి ఈజీగా ఉండేందుకు నోట్స్ కూడా రాసి పెడతారని ఆనీ చెప్పారు. తనకేదైనా క్లాస్ అర్థం కాకపోయినా టీచర్స్ తన కోసం స్పెషల్ క్లాసెస్ పెట్టేవాళ్లని ఆమె అన్నారు. ఇలాంటి సపోర్ట్ ఉండడం వల్ల తనకు ఓ వైపు సినిమాలు, మరో వైపు చదువును బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నానని ఆమె స్పష్టం చేశారు.
తాను చిన్నప్పటి నుంచీ క్లాస్‌లో ముందు వరుసలోనే కూర్చునేదాన్నని, కానీ డిగ్రీకి వచ్చేసరికి లాస్ట్ బెంచ్‌కి వెళ్లిపోయానని ఆనీ అన్నారు. తాను మీమ్స్ బాగా చూసి, చూసి బ్యాక్ బెంచర్స్‌లో ఏదో స్పెషల్ ఉంటుంది, ఫన్ ఉంటుంది అని చదివి, చదివి ఎలా ఉంటుందో తెలుసుకుందామని ట్రై చేశానని, నిజంగా ఫన్‌గానే ఉంటుందని ఆమె తెలిపారు.