ఐపీఎల్ లో చెన్నై అవుట్.. బాధ్యుడు అతడేనా..?

dhoni ipl

  ఐపీఎల్ చరిత్రలో మొన్నటిదాకా చెన్నై జట్టుది అద్భుతమైన ప్రయాణం. మధ్యలో ఒకసారి ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన కానీ, పడిలేచిన కెరటం మాదిరి తన సత్తా చాటుకుంది. ధోని నాయకత్వంలో తిరుగులేని జట్టుగా మారిపోయింది. ఎనిమిది సార్లు ఫైనల్ కు, మూడుసార్లు విజేతగా, ఐపీఎల్ చరిత్రలో అన్నిసార్లు ప్లే ఆఫ్ కు వెళ్లిన అద్భుతమైన చరిత్ర చెన్నై జట్టు సొంతం. కానీ 2020 ఐపీఎల్ లో ఘోరమైన ప్రదర్శనతో సగటు క్రికెట్ అభిమానిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక తమిళ తంబీలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ipl chennai team telugu rajyam

 

 చెన్నై జట్టు ఇలాంటి ఘోరమైన ప్రదర్శన చేయటానికి అనేక కారణాలు వున్నాయి. ముఖ్యంగా ఆ జట్టు రైనా లాంటి అద్భుతమైన అతగాడి సేవలు కోల్పోయింది. దానికి తోడు ఆ జట్టును కరోనా సమస్య తీవ్రంగా వేధించటం, ఆటగాళ్లకు సరైన ప్రాక్టీస్ చేసే అవకాశం కూడా లభించలేదు. గతంలో కొండంత లక్ష్యం ముందున్న కానీ చెన్నై విజయంపై అభిమానులు ధీమాగా వుండేవాళ్ళు. ఎన్నో మ్యాచ్ లను రైనా పవర్ హిట్టింగ్ చేస్తూ ఒంటిచేత్తో గెలిపించాడు. అలాంటి ఆటగాడు మరొకరు లేకపోవటం ప్రధాన సమస్య. రాయుడు ఒకరి రెండు మ్యాచ్ లో మెరిశాడు తప్ప, అతనిపై పూర్తిగా నమ్మకం పెట్టుకోలేని పరిస్థితి. ఇక జాదవ్ గురించి ఏమని చెప్పాలి. ఆడేది టెస్ట్ మ్యాచ్ అన్నట్లు అతని ఆటతీరు కొనసాగింది. ఇక ధోని కూడా మునుపటి ఫామ్ లో లేకపోవటం మరో సమస్య, కేవలం ఒక్క డుప్లిసిస్ లేదా వాట్సాన్ ఆడితేనే గెలుపు లేకపోతే లేదన్నట్లు అయ్యింది.

chennai ipl telugu rajyam

 

బ్రావో సేవలు కూడా చెన్నై కోల్పోవటం, హర్భజన్ లాంటి సీనియర్ బౌలర్ దూరం కావటం కూడా పెద్ద దెబ్బ.. కేవలం ఇవి మాత్రమే కాదు.. జట్టు కూర్పు విషయంలో ధోని తీసుకున్న నిర్ణయాలు కూడా చెన్నై ఓటమికి కారణాలు అనే చెప్పాలి. గత సీజన్ లో అద్భుతంగా రాణించి అత్యధిక వికెట్లు సాధించిన తాహిర్ కు ఒక్క అవకాశం కూడా ఇవ్వకపోవటం పెద్ద తప్పు, ఈ ఫార్మాట్ కు అసలు సూటవ్వని జాదవ్ ను ఎక్కువగా నమ్మటం,యువ ఆటగాళ్లతో ఎలాంటి ప్రయోగాలు చేయకుండా సీనియర్స్ ను నమ్ముకోవటం, జట్టులో చిన్న చిన్న మార్పులు కూడా చేయకపోవటం,మొదటిలో నెమ్మదిగా ఆడి, చివరిలో హిట్టింగ్ చేయాలనే జట్టు ఆలోచన.. ఇలాంటివి కూడా చెన్నై జట్టు దారుణమైన ప్రదర్శన చేయటానికి కారణాలు అనే చెప్పాలి. ఆడిన పది మ్యాచ్ల్లో కేవలం మూడు విజయాలే సాధించింది. మిగిలిన నాలుగు మ్యాచ్ లు గెలిచినా కానీ ప్లే ఆఫ్ కు వెళ్ళటం కష్టం ఇక ఈ సీజన్ లో చెన్నై జట్టు దాదాపుగా టోర్నీ నుండి వెళ్ళిపోయినట్లే లెక్క.