Actor Charmi: సినిమా అంతా అయిపోయాక ఛార్మి ప్రమోషన్‌కి రాలేదు.. మా అసోసియేషన్‌లో కంప్లైంట్ చేశాం..

Actor Charmi: సినిమా షూటింగ్ అంతా అయిపోయాక హీరోయిన్ ఛార్మి ప్రమోషన్‌కి రానన్నారని నిర్మాత యలమంచి రవిచంద్ అన్నారు. సినిమాకు ప్రమోషన్‌కు రాకపోవడం ఏంటీ అనే దానిపైన కొంచెం కాంట్రవర్సీ అయిందని ఆయన చెప్పారు. గొడవ కూడా పడాల్సి వచ్చింది. చివరికి మా అసోసియేషన్‌లో పెద్దలు మురళీ మోహన్ కల్పించుకోవడంతో సమస్య పరిష్కారం అయిందని ఆయన తెలిపారు. దాని తర్వాత ఆమె ప్రమోషన్‌కు వచ్చారని ఆయన చెప్పారు.

ఇకపోతే తాము అప్పటికి అమౌంట్‌ కూడా ఇచ్చేశామని, అలా ఇవ్వకుండా ఉంటే తమ తప్పే అవుతుంది కదా.. అసలు తాము అప్పుడు ఆమె దగ్గరికి వెళ్లి అడగలేం కదా అని యలమంచి అన్నారు. కానీ డబ్బు అంతా ఇచ్చినా కూడా, ఆ రోజు ఛార్మి ఆ సినిమా ప్రమోట్ చేయడానికి నిరాకరించారని ఆయన చెప్పుకొచ్చారు. దాని మీద ఇన్వెస్ట్ చేసి, హీరో, హీరోయిన్ ప్రమోషన్‌కు రాకపోతే, మరి ప్రొడ్యూసర్ ఏమైపోతారనే అంశంతో తాము కొంచెం అగ్రెస్సివ్‌గా వెళ్లామని ఆయన స్పష్టం చేశారు.

ఆ తర్వాత ఈ విషయంపై ఛార్మి వెళ్లి మా అసోసియేషన్‌లో చెప్పారని ఆయన తెలిపారు. దానిపై చర్చించిన మురళీ మోహన్ గారు పిలిచి, చిన్న చర్చ పెట్టి ఆ సమస్యను పరిష్కారం చేశారు. అంతా సమసిపోయాక తిరిగి ఛార్మి వచ్చి మూవీ ప్రమోషన్‌కు అటెండ్ అయ్యారని ఆయన వివరించారు.