Chandrababu Super Confident : సంక్షోభంలోంచి గట్టెక్కేస్తాం: టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా.!

Chandrababu Super Confident :  తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ప్రస్తుత రాజకీయ సంక్షోభం నుంచి తెలుగుదేశం పార్టీని గట్టెక్కించేస్తాననే ధీమాతో వున్నారు. కానీ, అది సాధ్యమయ్యే పనేనా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. నిజానికి, తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదు.

కానీ, అప్పటి పరిస్థితులకీ ఇప్పటి పరిస్థితులకీ చాలా తేడా. అప్పట్లో టీడీపీ అనుకూల మీడియా మాత్రమే వుండేది.. ఇప్పుడు టీడీపీ వ్యతిరేక మీడియా కూడా వుంది.

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి నాయకులతోపాటు కార్యకర్తల బలం వుండేది. ఎలాంటి ప్రలోభాలక గురికాని రాజకీయ నాయకులుండేవారు. కార్యకర్తలూ అంతే. కానీ, గోడ దూకే రాజకీయ నాయకుల్ని తయారు చేసిందే చంద్రబాబు. పార్టీ కార్యకర్తలకోసం చేతి చమురు వదిలించుకోవడం మొదలెట్టిందీ చంద్రబాబే.

అలా మొత్తంగా రాజకీయ వ్యవస్థ మీద తనదైన ‘అతి’ని బలవంతంగా రుద్దేశారు.

రోజులు మారాయ్.! ఒకప్పటిలా చంద్రబాబులో ఉత్సాహం లేదు. అదే సమయంలో ఆయనకు వయసు కూడా మీద పడుతోంది. పుత్రరత్నం రాజకీయాల్లో తన వారసత్వాన్ని కొనసాగిస్తాడని అప్పట్లో నారా లోకేష్ మీద ఆశలన్నా వుండేవి.

నారా లోకేష్ రాజకీయాల్లోకి వచ్చాక చంద్రబాబుకి ఆ నమ్మకమూ పోయింది. ఎలా చూసినా, తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న సంక్షోభం నుంచి గట్టెక్కే అవకాశమే లేదు.
కానీ, సంక్షోభాల్ని అవకాశాలుగా మార్చుకోవడం తనకు తెలుసంటూ, ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేస్తామని చంద్రబాబు ధీమాగా కుండబద్దలుగొట్టేస్తున్నారు.

ఇదే ఈ అతి చంద్రబాబు తగ్గించుకోవడంలేదు. పార్టీలో ప్రక్షాళన అవసరం. భజనపరుల్ని పక్కన పెట్టి పార్టీ కోసం నిఖార్సయిన సూచనలిస్తున్నవారిని చంద్రబాబు గౌరవించాల్సి వుంది.

ఇంకా నయ్యం, చంద్రబాబు నుంచి అలాంటి గొప్ప గొప్ప మార్పులు ఆశించేయగలమా.? తెలుగు తమ్ముళ్ళకే ఆ నమ్మకం లేదాయె.