జగన్ పథకం గొప్పతనాన్ని జనాలకి తెలిసేలా చేసిన చంద్రబాబు – సూపర్ సీన్ ఇది !

cbn and cm jagan

 జగన్ సర్కార్ 300 గజాల విస్తీర్ణం ఉన్న టిడ్కో అపార్ట్ మెంట్లను ఇళ్లను పేద ప్రజలకు ఒక్క రూపాయికే ఇవ్వటానికి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే, ఈ పంపిణీ డిసెంబర్ 25 నుంచి మొదలు కాబోతోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైనా ప్రచారం ఇంకా జోరందుకోలేదు. కానీ ఆ బాధ్యతను ప్రతిపక్షం తీసుకోని ఫ్రీ పబ్లిసిటీ ఇస్తుంది.

cbn and cm jagan

 అసెంబ్లీలో ఇళ్ల స్థలాలు, టిడ్కో అపార్ట్ మెంట్లపై అనవసర రాద్ధాంతం చేసి చంద్రబాబు తన బండారం అంతా తానే బైటపెట్టుకున్నారు. చంద్రబాబు హయాంలో ఎక్కడా ఎవరికీ ఉచితంగా ఇళ్ల స్థలం ఇవ్వలేదు, కట్టిన అపార్ట్ మెంట్లకు కూడా బ్యాంకు లోన్ ముడిపెట్టేసి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా పసుపు కుంకుమల పేర్లతో ఓటుకు నోట్లు వెదజల్లడానికి దిగమింగారు. ఇక వైసీపీ హయాంలో సీఎం జగన్ ఇళ్ల స్థలాలను పూర్తి ఉచితంగా పేదలకు అందిస్తున్నారు. చిన్నదైనా, పెద్దైనా ఉన్న వాటిలో సాధ్యమైనంత వరకు ఇవ్వటానికి ప్రణాళిక సిద్ధం చేశాడు.

 నిజానికి చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో టిడ్కో ఇళ్లను ఉచితంగా ఇచ్చే అవకాశం ఇవ్వలేదు. మూడు లక్షలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇస్తాయి. మిగిలిన మూడు లక్షలు మీరు నెలవారీ పద్దతిలో చెల్లించాలని ఎందుకు చెప్పాడు. సరే అలాగైనా ఆ ఐదేళ్ల కాలంలో ఒక్క ఇల్లు అయిన ఇచ్చాడా అంటే అది కూడా లేదు జగన్ ని ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న బాబు.. తన హయాంలో ఉచితంగా ఇవ్వలేకపోయిన విషయాన్ని, అపార్ట్ మెంట్ల పేరుతో పేద-మధ్య తరగతి వారిని అప్పులపాలు చేసిన విషయాన్ని బైటపెట్టారు.

 వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఇంకా అపార్ట్ మెంట్లను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించిన బాబు, తన హయాంలో ఐదేళ్లు వృథా చేసిన విషయాన్ని చాటి చెప్పినట్టయింది. ఈ రెండు తప్పుల్ని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా ఒప్పేసుకున్నారు. జగన్ అమలుచేస్తున్న ఈ పధకం గురించి టీడీపీ వాళ్లే ఒక పక్క భారీ ప్రచారం కలిపిస్తూ, మరోపక్క ఆ పధకం విషయంలో బాబు విఫలమైన విషయాన్నీ కూడా తెలియచేస్తున్నారు