అమలాపురం విశ్వాసం వెనుక చంద్రబాబు, పవన్ ఉన్నారు: మంత్రి దాడిశెట్టి

ఇటీవలే అమలాపురంలో జరిగిన ఘటన గురించి ప్రస్తుతం పలు చర్యలు జరుగుతున్నాయి. దీంతో దానికి కారణమైన నిందితులు ఎవరు అనేది పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇక ఈ విషయం గురించి తాజాగా రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి దాడిశెట్టి స్పందించాడు. తాజాగా ఆయన మీడియా ముందుకు వచ్చి కొన్ని విషయాలు బయట పెట్టాడు.

ఈ ఘటనపై లోతుగా విచారణ జరిపిస్తామని.. నిందితులు ఎవరైనా వదిలేది లేదని అన్నాడు. కుట్రలు పన్నడం చంద్ర బాబుకు అలవాటని.. పక్క ప్లాన్ ప్రకారం పచ్చని కోనసీమలో చంద్రబాబు, పవన్ అలజడి సృష్టించారని మండిపడ్డాడు. అంబేద్కర్ పేరు పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేయలేదా.. జనసేన దీక్షలు చేయలేదా అని ప్రశ్నించాడు. ఆరోజు తుని ఘటనకు చంద్రబాబు కారణమని.. ఇప్పుడు కూడా ఆయనే కారణమని.. ఈ అమలాపురం విధ్వంసం వెనుక చంద్రబాబు, పవన్ హస్తం ఉందని అన్నాడు.