ఒక వైపు కరోనా వచ్చి దాదాపుగా అందరి జీవితాలు అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే.. ఇక ప్రైవేట్ ఉద్యోగుల కష్టాలైతే వర్ణానితం.. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది.. అదేమంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్‌ను అందించేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేసిందట. ఇందుకు గానూ తక్షణం రూ 3737 కోట్లను విడుదల చేసేందుకు సిద్దం అయ్యిందట.. కాగా కేబినెట్ నిర్ణయంతో దాదాపుగా 30 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుందని, ఇక ఈ బోనస్ జారీతో పండుగ సీజన్‌లో డిమాండ్ పుంజుకుంటుందని ప్రభుత్వం భావిస్తోందట..
ఇకపోతే కేంద్రమ్న్ అందించే ఈ బోనస్ కేంద్ర ఉద్యోగుల అకౌంట్లో ఒకే వాయిదాలో జమవుతుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. నిజానికి ఈ కష్టకాలంలో కేంద్ర నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతుందనే అభిప్రాయాన్ని కేంద్ర పెద్దలు వెల్లడిస్తున్నారు.. ఇకపోతే ప్రభుత్వ నిర్ణయంతో రైల్వే, పోస్ట్ ఆఫీస్, ఈపీఎఫ్‌ఓ, ఈఎస్‌ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్ధల్లో పనిచేసే 17 లక్షల మంది నాన్ గెజిటెట్ ఉద్యోగులతో పాటు, మరో 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్ లభించనుందట..
ఇదిలా ఉండగా కేంద్రం ప్రకటించిన ఆధారిత బోనస్‌ను దుర్గా పూజ లోగా విడుదల చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని రెండు ప్రధాన రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయట.. ఇక తాజాగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ తమ ఉద్యోగులకు 6 నెలల వేతనాన్ని బోనస్‌గా ప్రకటించింది. మొత్తం 45,000 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జకర్‌బర్గ్ వెల్లడించారు.. మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పండగ పండగలా ఉంటుండగా ప్రైవేట్ ఉద్యోగి మాత్రం పండగ చేసుకునే వారిని చూసి పైకి ఆనందపడటం, లోన బాధ పడటం తప్పితే ఏం చేయలేడన్నది నమ్మలేని నిజం..