Bheemla Nayak: పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో ఆ పదాన్ని తొలగించిన సెన్సార్..!

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి మల్టీస్టారర్ చిత్రంగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇకపోతే ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాని ఈ నెల 25వ తేదీ గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

ఇలా ఉండగా ఇప్పటికే పనులన్నింటినీ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫైనల్ కాపీని సెన్సార్ సభ్యులు వీక్షించారు. ఈ క్రమంలోని ఇందులో తెలుగులో అభ్యంతరకరమైన ‘లంబ్డీ’ అనే పదాన్ని తొలగించాలని సెన్సార్ సభ్యులు చెప్పినట్లు తెలుస్తోంది ది. తెలుగులో ఈ పదాన్ని ఎవరినైనా తిట్టడం కోసం ఉపయోగించే ఒక బూతు పదంగా పరిగణించి సెన్సార్ సభ్యులు ఈ పదాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలు ఈ పదాన్ని తొలగించినట్లు వెల్లడించారు.

ఇకపోతే బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలో కూడా ఈ విధమైనటువంటి బూతు పదం ఉండటం చేత సెన్సార్ సభ్యులు ఈ పదాన్ని కూడా తొలగించినట్లు తెలుస్తోంది. ఇక సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి కావడంతో ఈ సినిమాని 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలు కావడంతో పెద్ద ఎత్తున పవన్ అభిమానులు ఈ సినిమా టికెట్స్ ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. మరి ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా సందడి చేస్తుందో తెలియాల్సి ఉంది.