తొక్క తీయడానికి సిద్ధమైన సీబీఐ.. ఇది నెక్స్ట్ లెవెల్ అరాచకం !

 

ఏపీలో రాజకీయాలు రోజుకో తీరుగా మారుతున్నాయి.. ప్రతిపక్షాల పోరులో అధికార పార్టీ భిన్నమైన ధోరణిలో ముందుకు సాగుతూ, టీడీపికి మచ్చెమటలు పట్టేలా చేస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. ఇకపోతే ఏపీ సీయం జగన్‌కు వరుసగా తలనొప్పులు తెచ్చే సంఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే.. అయినగానీ ఎలాంటి తొందరపాటు పడకుండా వైఎస్ జగన్ తనపాలనను కొనసాగిస్తున్నారు.. ప్రతిపక్షాలకు అనుగుణంగా పావులు కదుపుతూ తనదైన ముద్ర వేసుకుంటున్నారు..

ఇకపోతే ప్రస్తుత కాలంలో ఏపీలో సీబీఐ మంత్రపఠనం జరుగుతున్నట్లుగా ఉంది.. ప్రత్యర్ధులను ఇరకాటంలో పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సీబీఐ జపం చేస్తుస్తున్నట్లు స్పష్టంగా కనపడుతుంది.. ఇందుకు గాను అమరావతి రాజధాని భూముల కుంభకోణం, ఫైబర్ గ్రిడ్ లో జరిగిన అవినీతితో పాటుగా, తాజాగా అంతర్వేది రధం దగ్దం చేసిన సంఘటనలకు సంబంధించిన కేసులను సీబీఐకి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం పట్టుబడుతుంది. దీంతో ఏపీలో, సీబీఐ విచారణ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయట. ఇదిలా ఉండగా చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న కాలంలో 176 జీవో ద్వారా, ఏపీలో సీబీఐ విచారణకు అనుమతిని నిరాకరించారన్న విషయం తెలిసిందే.. అయితే వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జీవోను రద్దు చేసారు..

ఆనాడు వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుత పరిస్దితుల్లో ప్రతిపక్షం నోరు ఎత్తకుండా చేసే అస్త్రంగా ఉపయోగపడుతుంది.. అంతే కాకుండా విపక్షాలను కట్టడి చేయడానికి అధికార పార్టీకి, సీబీఐ సరైన సమాధానంగా కన్పిస్తున్నట్లుంది. అందుకే ఏపీ ప్రభుత్వం ప్రతి కేసును సీబీఐకి ఇచ్చేందుకే మొగ్గుచూపుతుంది.. ఈ నిర్ణయం వెనక ఉన్న కారణం ఏంటో తెలుసుకుంటే.. సీబీఐ విచారణ అంటేనే గుండెల్లో గుబులుపుడుతుంది. వారు సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితి కూడా ఉండదు. ఈ రకమైన ప్రశ్నలను గతంలో వైఎస్ జగన్ ఎదుర్కొన్నారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ లకు కూడా సీబీఐ రుచి చూపించాలని ఆరాట పడుతున్నట్లుంది.

 

ఇక సీబీఐ విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ అన్న ఆరోపణ కూడా లేకపోలేదు. కానీ ఈ విమర్శను పక్కన పెడితే సీబీఐ విచారణ ఎంతకాలం పడుతుందనేది చెప్పలేని పరిస్థితి. ఎటూ తెగకుండా ఏళ్ల పాటు విచారణ జరిగిన కేసులు కూడా ఉన్నాయి. దీంతో రాజకీయ వేధింపుల కోసమే సీబీఐని వాడతారన్న వాదన కూడా లేకపోలేదు. ఏది ఏమైన ప్రతిపక్షాల విషయంలో ఇది నెక్స్ట్ లెవెల్ అరాచకం అని అనుకుంటున్నారట..