Pushpa Item Song : వైరల్ : ‘పుష్ప’ ఐటెం సాంగ్ పై కేసు.. నిద్ర లేచిన పురుష ప్రపంచం.!

Pushpa Item Song : ఈ ఏడాది టాలీవుడ్ నుంచి కాబోతున్న అతి పెద్ద రిలీజ్ ఏదన్నా ఉంది అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం “పుష్ప పార్ట్ 1” అని చెప్పాలి. నార్మల్ గా కాకుండా పాన్ ఇండియా వైడ్ ఈ సినిమా విడుదల ఈ ఏడాది తెలుగు నుంచి అవుతున్న ఏకైక సినిమా కావడంతో భారీ రిలీజ్ గా ఇది నిలిచింది. అయితే ఈ సినిమా నుంచి చిట్టా చివరిగా రిలీజ్ చేసిన సాంగ్ ఐటెం సాంగ్.

స్టార్ హీరోయిన్ సమంతా ఓ రేంజ్ లో అందాలు ఆరబోసి చేసిన సాంగ్ ఇది. అయితే ఈ పాటపై ఇప్పుడు కేసు నమోదు చెయ్యడం వైరల్ అంశంగా మారింది. ఇక్కడ బాగా ఆశ్చర్యకర అంశం ఏమిటంటే.. ఈ పాట బాగోలేదని ఆంధ్ర రాష్ట్ర పురుష సంగం కేసు వేసారట. పాటలోని లిరిక్స్ మగవాళ్ల మనోబావాలు దెబ్బ తీసేలా ఉన్నాయని.

మగవాళ్ళు ఎప్పుడూ కామంతో ఉంటారు అనే విధంగా ఈ పాట ఉందని అందుకే ఈ పాటని పుష్ప సినిమా నుంచి నిషేదించాలని కేసు వేసారట. అంతేకాకుండా ఇది కోర్టు వరకు కూడా వెళ్లిందట. ఇది వరకు మహిళా సంఘాలు మహిళలపై చిన్న అభ్యంతరకర పదం ఉన్నా కొంత రచ్చ చేసేవారు. ఇప్పుడు ఊహించని విధంగా పురుష సంగం స్పందించడంతో ఇదే హాట్ టాపిక్ గా మారింది.