కెప్టెన్ సన్నీ: బిగ్‌బాస్ టైటిల్ విన్నర్ అవుతాడా.?

ఎట్టకేలకు బిగ్ హౌస్ కెప్టెన్‌గా సన్నీ ఎంపికయ్యాడు. పాపం సన్నీ, కెప్టెన్సీ కోసం చాలా చాలా ప్రయత్నాలు చేశాడు ఇంతవరకూ. తనకొచ్చిన ప్రతీ అవకాశానికీ తన వంతు బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తూనే వచ్చాడు. కానీ, లక్ కలిసి రాలేదు. ఎట్టకేలకు యానీ మాస్టర్ పుణ్యమా అని సన్నీకెప్టెన్ అయ్యాడు. తన కల నెరవేర్చుకున్నాడు.

ఎప్పుడో అప్పుడు కెప్టెన్ అవుతానని ముందుగానే కెప్టెన్ డ్రస్సు కూడా సిద్ధంగా తెచ్చుకున్నాడంటేనే సన్నీ, కెప్టెన్సీకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో అర్ధం చేసుకోవచ్చు. కెప్టెన్ డ్రస్సులో సరికొత్త సంతోషంతో మెరిసిపోయాడు సన్నీ. ఇక ఆంటీలైన ప్రియ, యానీ మాస్టర్‌లను బాగానే కాకా పడుతున్నాడు కెప్టెన్ సన్నీ.

ఇదిలా ఉంటే, హౌస్‌లో కొంతమందికి సన్నీ కెప్టెన్ అవడం ఇష్టం లేకపోయినా, టైటిల్ విన్నర్ మాత్రం సన్నీనే అవుతాడంటూ జోస్యం చెబుతోంది ఆల్రెడీ హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయిన బిగ్ కంటెస్టెంట్ లహరి. సన్నీ గేమ్ చాలా బావుందనీ, తన ఆటలో జెన్యూనిటీ ఉంటుందనీ ఖచ్చితంగా విన్నర్ అయ్యే అర్హత సన్నీకే ఉందని చెబుతోంది లహరి.