Samantha: నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత ఏమి చేసినా హాట్ టాపిక్‌గా మారుతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ తన ఫోటోలు షేర్ చేస్తూ, కొన్ని వీడియోలు పోస్ట్ చేస్తూ ఏదో ఒక విధంగా అభిమానులకు చేరువలోనే ఉంటుంది. అయితే చైతో విడిపోయిన తర్వాత సామ్ చిన్న ఫొటో పెట్టినా అది వైరల్‌గా మారుతుండడం చర్చనీయాంశం.
ప్రస్తుతం సమంత పేరు బాగా మారుమోగుతోంద. పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్‌తో ఇండస్ట్రీ దృష్టిని మరోసారి తనవైపు తిప్పుకున్న సామ్… ప్రస్తుతం వరుస సినిమాలకు సైన్ చేస్తూ కెరీర్‌లో దూసుకుపోతోంది. ఇక కేవలం సినిమాలకే మరిమితం కాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే ఆసక్తికర పోస్టులు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం లైఫ్‌ను బిజీగా గడిపేలా ప్లాన్ చేసుకున్న సామ్, ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెకేషన్స్ కోసం విహార యాత్రలకు వెళుతున్న అందరికీ తెలిసిందే.
ఇక వివరాల్లోకి వెళితే సమంత తాజాగా పోస్ట్ చేసిన ఓ ఫొటోకు కొన్ని గంటల్లోనే లైక్‌ల వర్షం కురిసింది. అదేంటంటే ప్రస్తుతం హాలిడే ట్రిప్‌లో భాగంగా కేరళలో ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ తన స్నేహితురాలితో బీచ్ ఒడ్డున దిగిన ఓ ఫొటోను షేర్ చేస్తూ.. ‘నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను’ అనే క్యాప్షన్‌ను జతచేసింది. దీంతో పాటు ‘బెస్ట్ ఫ్రెండ్స్’ అనే హాష్ ట్యాగ్‌ను కూడా జోడించింది. సామ్ పోస్ట్ చేసిన ఈ ఫోటో కొన్ని గంటల వ్యవధిలోనే కొన్ని లక్షల లైక్‌లను సొంతం చేసుకుని ప్రస్తుతం ట్రెండింగ్‌గా నిలిచింది.