అమెరికాలోని కాలిఫోర్నియా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. శాక్రమెంటో నగరంలో ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగుడు కాల్పులు జరపడంతో ఆరుగురు పౌరులు మృతిచెందారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. శాక్రమెంటో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఆ ప్రాంతంలో కర్ఫ్యూను విధించారు. అయితే ఈ కాల్పులకు తెగబడింది ఎవరనేది స్పష్టమైన సమాచారం లేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.