బజ్ : RRR నుంచి బిగ్ అప్డేట్ రాబోతోందా?

ప్రెజెంట్ భారతీయ సినిమా దగ్గర ఎన్నో అంచనాలు నెలకొల్పుకొని ఉన్న పలు పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లు కొన్ని ఉన్నాయి. మరి వాటిలో కూడా అన్ని భాషల్లోనూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నవీ కొన్నే ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి ప్రశాంత్ నీల్ కేజీయప్ 2 ఒకటి కాగా మరొకటి దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ (RRR) మూవీ కూడా ఒకటి. మరి వీటిలో అల్రెడీ కేజీయఫ్ కి రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిపోయింది.

ఇది సహా మరెన్నో బాలీవుడ్ బడా చిత్రాలు కూడా తమ కొత్త డేట్స్ ని ప్రకటించేస్తున్నారు. దీనితో అందరి కళ్ళు రాజమౌళి సినిమాపై పడ్డాయి. అందుకే మేకర్స్ ఈ విషయంలో త్వరపడాలని చూస్తున్నారట. మరి ఇప్పుడు దానికి రంగం సిద్ధం చేసినట్టుగా బజ్ వినిపిస్తుంది. సినీ వర్గాల నుంచి సమాచారం ప్రకారం మేకర్స్ ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారని తెలుస్తుంది.

పైగా అది ఈరోజే ఉండొచ్చని మరో గట్టి టాక్. ఇపుడు అంతా కూడా ఈ భారీ సినిమా కొత్త డేట్ కోసమే ఎదురు చూస్తున్నారు. ఇది వచ్చాకనే మిగతా సినిమాల డేట్స్ కూడా మారే అవకాశం ఉంది అందుకే బిగ్గెస్ట్ అప్డేట్ గా ఇది మారింది. మరి ఈ చిత్రంలో చరణ్, తారక్ లు అల్లూరి, కొమరం భీం లుగా నటించిన సంగతి తెలిసిందే.