బర్త్ డే బేబీ.. బుట్టబొమ్మ.. ‘ప్రేరణ..’ ది యాంజిల్.!

బుట్టబొమ్మ పూజా హెగ్దే పుట్టినరోజు సందర్భంగా ‘రాధే శ్యామ్’ సినిమా నుంచి లేటెస్టుగా రిలీజ్ చేసిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. వైట్ కలర్ లాంగ్ ఫ్రాక్‌లో పూజా హెగ్దే దివి నుంచి భువికి దిగిన యాంజిల్‌లా మెరిసిపోతోంది. గతంలోనూ ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో నీలి రంగు లాంగ్ ఫ్రాక్‌లో అందమైన నెమలిలా మెరిసింది పూజా హెగ్దే.

ఇక లేటెస్ట్ పోస్టర్‌లో వైట్ యాంజిల్ గ్లామర్‌కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ‘అందరి హృదయాలను గెలుచుకున్న మా ప్రేరణకు పుట్టినరోజు శుభాకాంక్షలు..’ అంటూ యూవీ క్రియేషన్స్ సంస్థ అందంగా పూజా హెగ్దేకు బర్త్‌డే విషెస్ తెలిపింది. ఆరడుగుల ఆజానుబాహుడు ప్రబాస్, యాంజిల్ పూజా హెగ్దే జంట కలర్ ఫుల్‌గా కనువిందు చేయనుందన్న ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉన్నాయి రిలీజవుతున్న ఒక్కొక్క పోస్టర్.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ అందమైన ప్రేమ కథా చిత్రానికి ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ సినిమా నిర్మితమవుతోంది.

ఇకపోతే, పూజా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే, ‘ఆచార్య’ సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా నటిస్తోంది. అక్కినేని హీరో అఖిల్ సరసన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటిస్తోంది. దసరా కానుకగా ఈ సినిమా ధియేటర్‌లో సందడి చేయనుంది.