‘బుట్టబొమ్మ’ లక్కును అలా వాడేసుకుంటోన్న ‘వరుడు’

బుట్టబొమ్మ పూజా హెగ్దే లక్కు అంతా ఇంతా కాదు. ఒకటి కాదు, రెండు కాదు, చాలాసార్లే ఆ విషయం ప్రూవ్ అయ్యింది. లేటెస్టుగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమా మరోసారి ఆ విషయాన్నిప్రూవ్ చేసింది. సరే, ఈ విషయం పక్కన పెడితే, పూజా హెగ్దే అదృష్టాన్ని యంగ్ హీరో నాగశౌర్య ఈ విధంగా వాడేసుకుంటున్నాడు.

నాగశౌర్య, రీతూ వర్మ జంటగా ‘వరుడు కావలెను’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ నెల 29న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇంతవరకూ సైలెంట్‌గా ఉన్న ‘వరుడు కావలెను’ బ్యాచ్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ అంటూ ప్రీ రిలీజ్‌ని ఘనంగా నిర్వహించింది.

అంతటితో ఆగలేదు.. ఇప్పుడు ‘సంగీత్’ ఫంక్షన్ అంటూ మరో వేడుకకు రెడీ అయ్యింది. ఆ ఫంక్షన్ కోసం బుట్టబొమ్మ పూజా హెగ్దేని ముఖ్య అతిధిగా ఆహ్వానించారు ‘వరుడు కావలెను’ బ్యాచ్. ప్రముఖ బ్యానర్ సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఈ సినిమాని లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య తెరకెక్కిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో గతంలో పూజా హెగ్దే ‘అల వైకుంఠపురములో’, ‘అరవింద సమేత’ సినిమాల్లో నటించి సూపర్ హిట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే.