Pan India Star: బాహుబలి విజయం సాధించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి పేరు మారుమోగిపోయింది. ఒకానొక సమయంలో దక్షిణాది సినిమాలు అంటే ఉత్తరాదిలో చిన్న చూపు ఉండేది. కానీ మన దర్శకధీరుడు రాజమౌళి అందరి అభిప్రాయాన్ని మార్చివేశాడు. బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించడం వల్ల బాలీవుడ్ టాప్ హీరోలు సైతం రాజమౌళితో సినిమా చేయటానికి ఎదురుచూస్తున్నారు. ఒక ప్రాంతీయ కథానాయకుడు పాన్ ఇండియన్ స్టార్ కావాలంటే రాజమౌళి సహాయం తప్పనిసరిగా ఉండాలని అందరి అభిప్రాయం.
రెబల్ స్టార్ ప్రభాస్ ఎస్ ఎస్ రాజమౌళి నిర్మించిన బాహుబలి సినిమాలో నటించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా తనకి గుర్తింపు వచ్చి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అని అందరి అభిప్రాయం. బాహుబలి సినిమా తర్వాత చాలామంది ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలు చేసినప్పటికీ ఆ స్థాయిలో ఆశించిన ఫలితాలు రాక హీరోలు పాన్ ఇండియన్ స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకోలేక పోయారు. టాలీవుడ్ లో బాహుబలి ఈ సినిమా ద్వారా ప్రభాస్ పాన్ ఇండియన్ లెవల్లో సినిమా మార్కెట్ విస్తరించుకున్నారు. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో , రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ద్వారా వారిద్దరూ పాన్ ఇండియన్ స్టార్ట్ గా గుర్తింపు తెచ్చుకోనీ వారి మార్కెట్ పెరుగుతుందని అందరి అంచనాలు.ఇక జక్కన్న తరువాత మహేష్ బాబుతో చేయబోయే సినిమా ద్వారా మహేష్ బాబు కూడా పాన్ ఇండియన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంటారు అనటంలో సందేహం లేదు.
అయితే ఇక్కడ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం రాజమౌళి సహాయం లేకుండానే పాన్ ఇండియన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. తెలుగు,మలయాళంలో బన్నీకి మంచి మార్కెట్ ఉంది. పుష్ప సినిమా ద్వారా ఉత్తరాదిన కూడా బన్నీ కి మంచి మార్కెట్ ఏర్పడింది. పుష్ప సినిమా ద్వారా తమిళనాట కూడా బన్నీ సినిమాలకి మంచి మార్కెట్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.ఆల్ ఓవర్ ఇండియా పుష్ప -2 సినిమాకి మంచి హైప్ ఉంటుంది అనటంలో అతిశయోక్తి లేదు. మొత్తానికి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి సహాయం లేకుండానే పాన్ ఇండియన్ స్టార్స్ అయిన హీరోలలో ఏకైక హీరో అల్లు అర్జున్ అని చెప్పవచ్చు.