Pushpa : బన్నీ మామూలోడు కాదు.. ముగ్గురు బిగ్ స్టార్స్ ని దింపుతున్నాడా?

Pushpa : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “పుష్ప పార్ట్ 1” ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ కి రెడీ అవుతుంది. దీనితో చిత్ర బృందం ఆల్రెడీ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసారు మొన్ననే ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు. ఇక దీని తర్వాత భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. ఈ సమయంలో అల్లు అర్జున్ కూడా పలు ఫంక్షన్స్ కి అటెండ్ అవుతూ సినిమాలు తన సినిమా కూడా ప్రమోట్ చేసుకుంటున్నాడు.

అయితే ఇపుడు బన్నీ తన సినిమా ఫంక్షన్ కి కూడా గట్టి ప్లాన్ చేసాడట. ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ అయినటువంటి ముగ్గురు స్టార్ హీరోలు ముఖ్య అతిధులుగా హాజరు అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట. మరి వారిలో ఒకరు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకడు కాగా ఇంకొకరు బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ అట.

ఇక అలాగే మరో బిగ్ స్టార్ మాత్రం మెగాస్టార్ చిరంజీవి అట. ఈ ముగ్గురిని బన్నీ తన సినిమా కోసం రంగంలోకి దింపుతున్నాడట. సినిమా ఎలా ఉంటుందో కానీ బన్నీ ప్లానింగ్ మాత్రం మామూలుగా లేదని చెప్పాలి. అలాగే ఇందులో ఎంతవరకు నిజముందో కూడా చూడాలి.