బన్నీ అభిమానులకి అది నచ్చడంలేదు.!

అల్లు అర్జున్ అభిమానులకి అస్సలేమాత్రం నచ్చడంలేదు. ఇంతకీ, ఏంటి నచ్చడంలేదు.? అంటే, ఇంకేముంది.. ‘పుష్ప’ సినిమా షూటింగ్ వ్యవహారాలు పక్కన పెట్టేసి, ఇతర హీరోల సినిమాల్ని ప్రమోట్ చేయడం. ‘కాస్త గ్యాప్ ఇవ్వండ్రా మా బన్నీ బాబుకి.. పుష్ప సినిమా పూర్తి చేసుకోనివ్వండి..’ అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.

వరుసగా వివిధ సినిమాల ఈవెంట్లకు అతిథిగా హాజరవుతున్న అల్లు అర్జున్, ఆయా సినిమాలకు పబ్లిసిటీ పరంగా తాను చేయాల్సినదంతా చేస్తున్నాడు. నిజానికి ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ, అల్లు అర్జున్ అభిమానులు.. తమ అభిమాన హీరో ఈ సందడిలో పడిపోతే, ‘పుష్ప’ ఔట్‌పుట్ ఎలా వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. అదీ అసలు సంగతి.

కాగా, ‘పుష్ప’ సినిమాకి సంబంధించి మేజర్ షూట్ పూర్తయిపోయింది. దాంతో, అల్లు అర్జున్.. ఇలా కాస్త సమయం చూసుకుని, తనవంతు బాధ్యతగా ఇతర సినిమాల్ని ప్రమోట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడన్నది ఇంకో వాదన.

ఇలా ఇతర హీరోల సినిమాల్ని తాను ప్రమోట్ చేస్తే, తన సినిమాలకీ అది అదనపు అడ్వాంటేజ్ అవుతుందనేది బహుశా అల్లు అర్జున్ ఆలోచన కావొచ్చు.