బాలయ్య హీరోయిన్‌కి బంపర్ ఛాన్స్

‘కంచె’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ముద్దుగుమ్మ హీరోయిన్‌ ప్రగ్యా జైశ్వాల్. తొలి సినిమాతో హిట్ కొట్టడమే కాదు, ఇన్నోసెంట్ అండ్ క్లాసిక్ ఫీచర్స్‌తో బాగా ఎట్రాక్ట్ చేసింది కూడా. అయితే, ఎందుకో అమ్మడికి అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే వరించాయి.

అడపా దడపా సినిమాలు తప్ప, చెప్పుకోదగ్గ సినిమాలు ప్రగ్యా దరి చేరలేదింతవరకూ. తాజాగా బాలయ్య బాబుతో ‘అఖండ’ సినిమాలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఓ రకంగా ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చేమో. కానీ, ఇది చాలదు. అంతకు మించి కావాలి. అందుకే ఓ ప్యాన్ ఇండియన్ సినిమాలో ప్రగ్యాని ఎంచుకునే దిశగా చర్చలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

టాలీవుడ్‌లో ప్యాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఓ స్టార్ హీరో సినిమాకి హీరోయిన్‌గా ప్రగ్యా పేరు పరిశీలనలోకి వచ్చిందట. యాక్షన్ గాళ్ ఇమేజ్ ఉన్న పాత్ర అనీ తెలుస్తోంది. ఇంకేం ప్రగ్యా పంట పండినట్లే. త్వరలోనే ఆ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. మరోవైపు ఓ బాలీవుడ్ సినిమాలోనూ ప్రస్తుతం ప్రగ్యా నటిస్తుండడం విశేషం.