బుచ్చిబాబుకు మరో కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాతలు

Buchibabu Sana gets benz as a gift from Mythri makers

Buchibabu Sana gets benz as a gift from Mythri makers

ఒక్క హిట్ సినిమా తీస్తే ఇండస్ట్రీలో లెవల్ మారిపోతుంది అనడానికి బుచ్చిబాబు సాన ప్రత్యక్ష నిదర్శనం. ‘ఉప్పెన’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడంతో ఆయన స్థాయి పెరిగిపోయింది. పేరుతో పాటు ఆఫర్లు, బహుమతులు కూడ గట్టిగానే అందుతున్నాయి. ఇప్పటికే బుచ్చిబాబుకు పారితోషకంతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాతల నుండి పలు కాస్ట్లీ బహుమతులు అందాయి. బుచ్చిబాబు ఇచ్చిన సక్సెస్ నిర్మాతలకు విపరీతంగా నచ్చినట్టు ఉంది. అందుకే బహుమతులు ఇవ్వడం ఆపలేదు. తాజాగా కూడ బుచ్చిబాబుకు కాస్ట్లీ కార్ ప్రజెంట్ చేశారు.

కార్ అంటే చిన్న కార్ కాదు.. ఏకంగా బెంజ్ జి.ఎల్.సి. దాని ధర కోటికి దగ్గరలోనే ఉంటుందట. బుచ్చిబాబు తన కారులో మొదటగా తన గురువు సుకుమార్ ను ఎక్కించుకుని డ్రైవ్ చేసి ముచ్చటపడ్డారు. ఇక ఆఫర్ల విషయానికొస్తే బుచ్చిబాబు తర్వాతి సినిమా కూడ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలోనే ఉండనుంది. అది కూడ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతోనే. ఈ సినిమాకు బుచ్చిబాబు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ పుచ్చుకోనున్నారు. ఇలా ఒక్క హిట్ కొట్టడంతో బుచ్చిబాబు స్థాయి అన్ని విధాలుగా మారిపోయింది.