ఈ ఏడాది సినిమా హాళ్లు తెరుచుకున్న మూడు నెలల్లో నాలుగైదు హిట్ సినిమాలు పడ్డాయి. వాటిలో ‘ఉప్పెన’ కూడ ఒకటి. బుచ్చిబాబు సాన ఈ సినిమాకు దర్శకుడు. రికార్డ్ వసూళ్ళు సాధించిన ఈ సినిమాతో బుచ్చిబాబు బాగా పాపులర్ అయ్యాడు. ఆయనతో వర్క్ చేయడానికి చాలామంది నిర్మాతలు, హీరోలు ఆసక్తి చూపించారు. కానీ బుచ్చిబాబు మాత్రం ఎన్టీఆర్ మీదే ఫిక్స్ అయ్యాడు. ఎన్టీఆర్ కూడ బుచ్చిబాబుకు సినిమా చేస్తానని మాటిచ్చారు. దీంతో బుచ్చిబాబు స్క్రిప్ట్ పనుల్లో పడిపోయాడు. ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత కొరటాల శివ సినిమా చేసి తన ప్రాజెక్ట్ చేస్తాడని బుచ్చిబాబు ఆశించాడు. కానీ ఇప్పుడది కుదిరేలా కనబడట్లేదు.
ఎందుకంటే ఎన్టీఆర్ కొరటాల శివ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బుచ్చిబాబు కంటే ముందే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ చర్చల్లో ఉన్నా అప్పటికి ఫైనల్ కాలేదు. ఇప్పుడది కుదురింది. సో.. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అవ్వాలంటే ఇంకో ఏడాది పట్టేలా ఉంది. రెండవ సినిమా ఎన్టీఆర్ తోనే చేయాలి అంటే అప్పటివరకు ఖాళీగా ఉండాలి బుచ్చిబాబు. ఇది గ్రహించిన ఆ యంగ్ డైరెక్టర్ మనసు మార్చుకుని ఎన్టీఆర్ ఖాళీ అయ్యేలోపు వేరొక సినిమా చేసుకుంటే మంచిదని డిసైడ్ అయ్యారట. ఆమేరకు ప్రయత్నాలు కూడ మొదలుపెట్టారట.