Chiranjeevi: చిరంజీవి కారణంగా వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి… కమిట్మెంట్ ఉండాలి.. కవిత షాకింగ్ కామెంట్స్!

Chiranjeevi: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది. ఈమె తన తండ్రి కెసిఆర్ కు రాసిన ఒక లేఖ కారణంగా పెద్ద ఎత్తున వార్తలో నిలిచారు. ఇక ఈమె తన తండ్రికి రాసిన లేఖను బట్టి చూస్తుంటే పార్టీకి దూరమవుతారని వార్తలు కూడా బయటకు వచ్చాయి. తాజాగా ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కవిత ఎన్నో విషయాల గురించి మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో భాగంగా ఈమె అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇలా అరెస్టు కావడంతో తనని బయటకు తీసుకువచ్చే మార్గాలు ఏవి కనిపించలేదు దీంతో తన తండ్రి కెసిఆర్ ఏకంగా బిఆర్ఎస్ పార్టీని బిజెపిలోకి విలీనం చేయాలనే ఆలోచన కూడా చేసినట్లు కవిత తెలిపారు.

ఇక ఈ విషయం నాకు తెలియడంతో నేను మా ఆయనతో నాన్నకు సమాచారం అందజేశాను నేను మరొక సంవత్సరమైనా జైలులో ఉంటా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ బిఆర్ఎస్ పార్టీని బిజెపిలో విలీనం చేయటానికి వీలు లేదు అంటూ నా భర్త చేత చెప్పించాననీ కవిత ఈ సందర్భంగా తెలియజేశారు. ఒక పార్టీని నమ్ముకొని ఎన్నో వేల కుటుంబాలు ఎంతో మంది కార్యకర్తలు పనిచేస్తున్నారు. అలాంటిది ఒకసారిగా మనం పార్టీని విలీనం చేసిన పార్టీలు మారిన వాళ్ళు తట్టుకోలేరని ఈమె వెల్లడించారు.

గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు ఎన్నికలలో పోటీ చేశారు అయితే ఉన్నఫలంగా ఆయన రాజకీయాలలో యూటర్న్ తీసుకుంటూ తన పార్టీని కాంగ్రెస్ లోకి కలిపేశారు.. ఇలా చిరంజీవి తన పార్టీని విలీనం చేయటం వల్ల తన పార్టీని నమ్ముకున్న కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రాజకీయాలలోకి వచ్చాక సీరియస్ నెస్ ఉండాలని, ప్రతిదానికి కమిట్ అయి పని చేయాలి అంటూ ఈ సందర్భంగా కవిత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఇక కవిత చేసిన వ్యాఖ్యలు నూటికి నూరుపాళ్ళు నిజమేనని పలువురు ఈమెకు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతున్నారు.