TG: కేసీఆర్ పేరు తీయకుండా ఒక్క స్పీచ్ అయిన ఇచ్చావా రేవంత్… సెటైర్లు పేల్చిన హరీష్ రావు?

TG: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఏడాది అవుతుంది అయినప్పటికీ ఈయన ఏ ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఏ ఒక్క ఉపన్యాసం ఇచ్చిన కెసిఆర్ పేరు పలకకుండా ఉపన్యాసం ఇవ్వలేరు అంటూ మాట్లాడారు. ఇప్పటివరకు ఒక్కసారైనా కేసీఆర్ పేరు తీయకుండా స్పీచ్ ఇచ్చావా అంటూ ప్రశ్నించారు.

పెట్టుబడుల కోసం ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లారు అక్కడికి వెళ్లిన కూడా తనకు కేసిఆర్ యాదికి వస్తున్నారంటూ మాట్లాడారని హరీష్ రావు విమర్శించారు.ఎంత సేపు ప్రతిపక్షాలను తిట్టుడు.. కేసీఆర్ ను తిట్టుడు తప్పా తెలంగాణకు రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని తెలిపారు. రేవంత్ రెడ్డి పరిపాలన చేతకానితనానికి పరాకాష్ట అంటూ హరీష్ రావు సెటైర్లు పేల్చారు.

ఇకపోతే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నాలుగు పథకాల అమలుకు రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయం గురించి కూడా హరీష్ రావు మాట్లాడారు.అప్పుడేమో దేవుళ్ల మీద ఒట్టు పెట్టి ముక్కోటి దేవుళ్లను మోసం చేసిండని, ఈరోజు కూడా అందరికీ ఇస్తానని కొందరికే అంటూ చివరికి అంబేద్కర్ ని కూడా మోసం చేశారంటూ హరీష్ రావు తెలిపారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఒక మంచి పని అయినా జరిగిందా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ వచ్చింది.. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి బంద్‌ అయిపోయిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వ్యవహార శైలి గురించి గమనిస్తున్నారని తెలిపారు. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడం కోసం ప్రజలందరినీ కూడా ఎంతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు అయితే గతంలో కేసీఆర్ ఎలాంటి దరఖాస్తులు లేకుండా అర్హులైన వారందరికీ కూడా పథకాలను అందించినట్లు హరీష్ రావు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ కాంగ్రెస్ పాలనపై విమర్శలు కురిపించారు.