Bhola Shankar : బ్రేకింగ్ అప్డేట్ : జాతరకి మాస్ అప్డేట్ ఇచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి.!

Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా మరో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కీలక పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ మాస్ చిత్రం “భోళా శంకర్”. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోలీవుడ్ హిట్ చిత్రం “వేదాళం” కి రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.
మరి ఒరిజినల్ కన్నా బెటర్ గా భారీ స్థాయిలో ప్లాన్ చేసిన ఈ సినిమా నుంచి చిత్ర బృందం ఎప్పటికప్పుడు కీలక అప్డేట్స్ ని అందిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు కూడా ఇంకో బ్రేకింగ్ అప్డేట్ ని మేకర్స్ ఇచ్చేసారు. ఈ సినిమా నుంచి మహా శివరాత్రి జాతర కానుకగా తమ శంకరుడి ఫస్ట్ లుక్ నుంచి రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు.
దీనికి డేట్ మరియు టైం ని కూడా ఫిక్స్ చేసేసారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని మార్చ్ 1న ఉదయం 9 గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. దీనితో ఒక్కసారిగా భారీ అప్డేట్ మంచి వైరల్ అవుతుంది. ఇంకా ఈ సినిమాకి మణిశర్మ తనయుడు మహతి సాగర్ సంగీతం అందిస్తుండగా అనీల్ సుంకర నిర్మాణం వహిస్తున్నారు.
https://twitter.com/BholaaShankar/status/1497808039549620230?s=20&t=_JvwKKFvdpAC4wWV3vSmkA