ఈ రోజు బ్రేక్ డాన్స్ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం. ఎందుకంటే, ఒలింపిక్ గేమ్స్‌లో బ్రేక్ డాన్స్ కూడా అధికారికంగా చేరింది. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ , రెగ్యులర్ ఆలోచనలకు కాస్త భిన్నంగా ఆలోచించింది. ప్రపంచవ్యాప్తంగా డాన్స్ కి ఉన్న గుర్తింపు, యూత్ లో ఉన్న క్రేజ్ అన్నీ గమనించింది. స్ట్రీట్ డాన్సుల్లో యువతీ, యువకులు ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారో, ఎలా తమ టాలెంట్ తో ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్నారో అన్నీ గమనించింది ఆ కమిటీ.
అందుకే, కోట్లమంది అభిమానాన్ని, ఆదరణనూ పొందుతున్న బ్రేక్ డాన్సింగ్ కి అఫీషియల్ స్పోర్ట్ గుర్తింపు ఇస్తూ 224లో ప్యారిస్లో జరగబోయే మెడల్ ఈవెంట్స్ లో చేర్చింది. 2020 కొన్ని రోజుల్లో ముగిసిపోతుంది. ఆ తర్వాత మరో 3 ఏళ్ల లోపే ప్యారిస్ ఒలింపిక్స్ ఉంటాయి. అప్పటి లోగా టాలెంటీర్లు బాగా ప్రిపేర్ అయ్యి గోల్డ్ మెడల్ కొట్టొచ్చు.
2024లో జరిగే ఈవెంట్‌లో స్కేట్ బోర్డింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, సర్ఫింగ్ కూడా ఉండనున్నట్లు IOC తెలిపింది. ఐతే… ఈ మూడూ… జపాన్ రాజధాని టోక్యోలో జరిగే ఒలింపిక్స్ నుంచే ప్రారంభమవుతాయి. నిజానికి ఈ ఒలింపిక్స్ ఈ సంవత్సరం జరగాల్సి ఉన్నా… కరోనా వల్ల… 2021 జులై 23కి వాయిదాపడ్డాయి. బ్రేక్ డాన్సింగ్‌ని ఒలింపిక్స్‌లో బ్రేకింగ్ అని పిలవబోతున్నారు. అలా ఎందుకు అంటే… 1970లో ఇది తొలిసారి మొదలైనప్పుడు అమెరికాలో దీన్ని హిప్-హాప్ అనేవారు. ఇప్పుడు హిప్-హాప్ అంటే యూత్‌కి ట్రెండీగా ఉండదన్న ఉద్దేశంతో.. బ్రేకింగ్ అని పిలవాలని డిసైడయ్యారు